Imran Khan : ఇమ్రాన్ ఖాన్ నివాసానికి పోలీసులు... ఏ క్షణంలోనైనా అరెస్ట్?...
ABN, First Publish Date - 2023-03-14T16:55:50+05:30
ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, మహిళా మేజిస్ట్రేట్‌ను బెదిరించారనే ఆరోపణలపై నమోదైన కేసులో జారీ అయిన నాన్ బెయిలబుల్
లాహోర్ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. తోష్‌ఖానా కేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు లాహోర్‌లోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మంగళవారం వెళ్ళాయి. ఆయనపై దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 80 కేసులు ఉన్నాయి.
ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, మహిళా మేజిస్ట్రేట్‌ను బెదిరించారనే ఆరోపణలపై నమోదైన కేసులో జారీ అయిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్‌ను ఇస్లామాబాద్ కోర్టు (Islamabad Court) మంగళవారం సస్పెండ్ చేసింది. అయితే తోష్‌ఖానా (Toshkhana) అవినీతి కేసులో జారీ అయిన అరెస్ట్ వారంట్లు అమల్లో ఉన్నాయి.
తోష్‌ఖానా అంటే ఖజానా అని అర్థం. ఇది పాకిస్థాన్ ప్రభుత్వ శాఖ (Pakistan government department). కేబినెట్ డివిజన్ పర్యవేక్షణలో ఇది పని చేస్తోంది. పాకిస్థాన్ నేతలు, అధికారులకు వచ్చే బహుమతులను దీనిలో ఉంచుతారు. బహుమతి విలువ రూ.30,000 కన్నా తక్కువగా ఉంటే, పాకిస్థాన్ అధ్యక్షుడు లేదా ప్రధాన మంత్రి దానిని తన వద్ద ఉంచుకోవచ్చు. ఇంత కన్నా ఎక్కువ ఖరీదైన బహుమతులను తోష్‌ఖానాలో ఉంచాలి. ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో ఖరీదైన బహుమతులను తోష్‌ఖానాకు అప్పగించలేదని ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులో ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పాకిస్థానీ మీడియా చెప్తోంది. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్దకు ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, ప్రజలు చేరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
Congress Vs BJP : రాహుల్ గాంధీపై అధికార పక్షం ఆగ్రహం
Same-sex marriage : స్వలింగ వివాహాలపై బయటపడిన ఆరెస్సెస్ వైఖరి
Updated Date - 2023-03-14T20:33:25+05:30 IST