కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jennifer Zeng: నిజ్జర్ హత్య వెనక చైనా కుట్ర.. హక్కుల కార్యకర్త సంచలన ఆరోపణలు

ABN, First Publish Date - 2023-10-09T09:16:42+05:30

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య వెనక చైనా ప్రమేయం ఉందంటూ స్వతంత్ర బ్లాగర్, హక్కుల కార్యకర్త జెన్నిఫర్ జెంగ్(Jennifer Zeng) సంచలన ఆరోపణలు చేశారు. భారత్ - కెనడా(India - Canada)లకు మధ్య విభేదాలు సృష్టించడానికే చైనా ఈ వల పన్నిందని ఆమె అన్నారు.

Jennifer Zeng: నిజ్జర్ హత్య వెనక చైనా కుట్ర..  హక్కుల కార్యకర్త సంచలన ఆరోపణలు

న్యూయార్క్: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య వెనక చైనా ప్రమేయం ఉందంటూ స్వతంత్ర బ్లాగర్, హక్కుల కార్యకర్త జెన్నిఫర్ జెంగ్(Jennifer Zeng) సంచలన ఆరోపణలు చేశారు. భారత్ - కెనడా(India - Canada)లకు మధ్య విభేదాలు సృష్టించడానికే చైనా ఈ వల పన్నిందని ఆమె అన్నారు. చైనాలో జన్మించిన ఆమె ప్రస్తుతం అమెరికాలో నివసిస్తూ.. జర్నలిస్టుగా, హక్కుల కార్యకర్తగా ఆమె పని చేస్తున్నారు. నిజ్జర్ హత్యపై ఆమె ఎక్స్(X) లో పోస్ట్ చేశారు. 'చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్(Xi Jin Ping) సైనిక వ్యూహంలో భాగంగా కమ్యూనిస్ట్(Communists) పార్టీ నేతలే నిజ్జర్ ని హత్య చేశారు.


ముందుగానే అనుకున్న ప్రణాళిక ప్రకారం కమ్యూనిస్ట్ ఏజెంట్లు నిజ్జర్ ని చంపారు. అతన్ని చంపి ఇండియా - కెనడాల మధ్య గొడవలు సృష్టించడమే చైనా(China) అంతిమ లక్ష్యం' అని ఆమె ఎక్స్ లో రాశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని సొంత గడ్డపైనే భారత్(India) హత్య చేయించిందని ట్రూడో ఆ దేశ పార్లమెంట్ లో ఆరోపించారు. ఈ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. వీటిని ఖండించిన భారత్ తామే హత్య చేయించామనడానికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది. ఈ ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. భారత్ లో కెనడా తన దౌత్య వేత్తలను తిరిగి పిలిపించుకోవడం.. భారత్ ఆ దేశానికి వీసాలు నిలిపేయడంతో దౌత్య పరమైన వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే కెనడా అంతర్జాతీయ సమాజం మద్దతును కోరుకుంటోంది.

Updated Date - 2023-10-09T09:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising