ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌కు బెయిలు మంజూరు

ABN, First Publish Date - 2023-04-14T19:49:33+05:30

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ )కు లాహోర్ హైకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది.

Imran Khan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లాహోర్ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు లాహోర్ హైకోర్టు (Lahore High Court) శుక్రవారం బెయిలు మంజూరు చేసింది. సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్‌పై అనుచిత పదజాలాన్ని ఉపయోగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేయకుండా ఏప్రిల్ 26 వరకు ఆయనకు రక్షణ కల్పించింది.

ఇస్లామాబాద్ పోలీసులు ఏప్రిల్ 6న నమోదు చేసిన కేసులో ఇమ్రాన్ సీనియర్ మిలిటరీ అధికారులను ఉద్దేశించి అనుచిత పదజాలాన్ని ఉపయోగించారని, వారి కుటుంబాలను ప్రమాదంలోకి నెట్టారని ఆరోపించారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని ఇమ్రాన్ ఖాన్ లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనను ఈ నెల 26 వరకు అరెస్ట్ చేయరాదని ముందస్తు బెయిలును మంజూరు చేసింది. బెయిలు పొడిగింపు కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని ఖాన్‌ను ఆదేశించింది.

ఇమ్రాన్ కట్టుదిట్టమైన భద్రత నడుమ హైకోర్టుకు హాజరయ్యారు. తాను దర్యాప్తునకు సహకరిస్తానని కోర్టుకు తెలిపారు. ఇస్లామాబాద్ పోలీసులు తనపై అల్పమైన కేసును నమోదు చేశారన్నారు.

ఇమ్రాన్ మీడియాతో మాట్లాడుతూ, పాకిస్థాన్ ముస్లిం లీగ్ - నవాజ్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయడం లేదని ఆరోపించారు. పంజాబ్‌లో ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం లేదని, దీంతో దేశానికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. ప్రపంచం దృష్టిలో బనానా రిపబ్లిక్‌గా కనిపిస్తోందని చెప్పారు. సైన్యాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఈ ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని హ్యాండ్లర్స్ నియమించారన్నారు. ఇప్పటి వరకు తమ పార్టీకి చెందిన దాదాపు 3 వేల మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారని, వారి మానవ హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా, మూడు టెర్రరిజం కేసుల్లో ఇమ్రాన్‌కు గురువారం ముందస్తు బెయిలు మంజూరైంది. ఆయనను మే 4 వరకు అరెస్ట్ చేయరాదని లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి :

Congress : జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడం ప్రమాదకరం : ఖర్గే

America : దశాబ్దంలో అతి పెద్ద ఇంటెలిజెన్స్ లీక్.. 21 ఏళ్ళ యువకుడి అరెస్ట్..

Updated Date - 2023-04-14T19:49:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising