ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wagner Group: వాగ్నర్ గ్రూప్ కీలక నిర్ణయం.. వెనక్కి మళ్లిన ప్రిగోజిన్

ABN, First Publish Date - 2023-06-25T11:18:52+05:30

శనివారం రష్యాలో అనూహ్య పరిణామాలు అధ్యక్షుడు పుతిన్‌ను కలవరపెట్టాయి. పుతిన్ పెంచి పోషించిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ఊ హించని తిరుగుబాటు చేయడంతో దాదాపు రష్యాలో అంతర్యుద్ధం పరిస్థితులు నెలకొన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: శనివారం రష్యాలో(Russia) అనూహ్య పరిణామాలు అధ్యక్షుడు పుతిన్‌ను(Puthin) కలవరపెట్టాయి. పుతిన్ పెంచి పోషించిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్(Wagner Force) ఊహించని తిరుగుబాటు చేయడంతో దాదాపు రష్యాలో అంతర్యుద్ధం పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్(Prigozhin).. రష్యాలోని కీలక నగరాలను ఆధీనంలోకి తీసుకొని పుతిన్‌ను కలవరపెట్టాడు. అయితే తిరుగుబాటు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే వెనక్కి తగ్గాడు. బెలారస్ అధ్యక్షుడు మధ్యవర్తిత్వంలో తన సేనలను ఆదివారం వెనక్కి తీసుకున్నారు.

రష్యాసైన్యం తిరుగుబాటు చేసిన కిరాయి సైన్య వాగ్నర్ గ్రూప్..గంటల వ్యవధిలోనే వెనక్కి తగ్గింది. తన బలగాలను రోస్తోవ్ నుంచి బెలారస్ తరలిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌పై క్రెమ్లిన్ క్రిమినల్ కేసులు ఎత్తివేసింది. రక్తపాత, అంతర్యుద్ధం నివారించడమే తమ లక్ష్యమని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందం ప్రకారం.. వాగ్నర్ ఫైటర్స్‌పై ఎలాంటి విచారణ ఉండదు.. వారు గతంలో చూపిన వీరోచిత పోరాటాన్ని మేం ఎల్లప్పుడూ గౌరవిస్తామని క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ తెలిపారు. వాగ్నర్ సేన తిరిగి తమ స్థావరాలకు వస్తుందని.. పోరాటయోధులు తిరిగి రష్యా సైన్యంతో కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ తన సైన్యాలను మాస్కో వెళ్లకుండా నిలిపివేయడంతో రష్యాలో అంతర్యుద్ధం ముప్పు తప్పింది.

కాగా.. శనివారం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్, రష్యా మిలిటరీ ఉన్నతాధికారుల మధ్య వైరం తీవ్రం కావడంతో.. దక్షిణ రష్యాలోని కీలకమైన ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని కిరాయి సైనికులు స్వాధీనం చేసుకున్నారు. మరో అడుగు ముందుకేసి రాజధాని మాస్కోను ముట్టడించేందుకు వెళ్లారు. దీంతో రష్యాలో దాదాపు అంతర్యుద్ధం పరిస్థితులు నెలకొన్నాయి. బెలారస్ అధ్యక్షుడు మధ్యవర్తిత్వంతో వాగ్నర్ గ్రూప్ వెనక్కి తగ్గడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2023-06-25T13:17:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising