ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pakistan: పాకిస్థాన్‌ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి.. ప్రతిఘటించిన సైన్యం

ABN, First Publish Date - 2023-11-04T12:38:55+05:30

పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్థాన్ వైమానిక దళంపై ఉగ్రవాదులు దాడి చేశారు. పంజాబ్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై శనివారం ఉదయం ఉగ్రవాదులు దాడి చేశారు.

పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్థాన్ వైమానిక దళంపై ఉగ్రవాదులు దాడి చేశారు. పంజాబ్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై శనివారం ఉదయం ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి ప్రయత్నించారు. అయితే పాక్ సైన్యం వెంటనే ప్రతిఘటించి ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్) వెల్లడించింది. ఐదు నుంచి ఆరుగురు ఉగ్రవాదులతో కూడిన బృందం భారీ ఆయుధాలతో ఉదయాన్నే పాకిస్థాన్ వైమానిక స్థావరంపై దాడి చేసిందని తెలిపింది. పాక్ సైన్యం వెంటనే స్పందించి ఎదురుకాల్పులు జరిపిందని పేర్కొంది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని, మిగతా వారిని బంధించినట్లుగా చెప్పింది.


ఉగ్రవాదులు వైమానిక స్థావరంలోకి ప్రవేశించేలోపు తాము దాడిని విఫలం చేశామని పీఎఫ్ తెలిపింది. ఈ దాడిలో వైమానిక దళ స్థావరంలో నిలిపి ఉంచిన మూడు విమానాలు దెబ్బతిన్నాయని, ఇంధన బౌజర్ కూడా ధ్వంసమైందని పాక్ సైన్యం వెల్లడించింది. దాడి జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా క్లియర్ చేయడానికి సమగ్ర జాయింట్ క్లియరెన్స్, కూంబింగ్ ఆపరేషన్ చివరి దశలో ఉందని పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది. మరోవైపు ఈ దాడి తమ పనేనని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-జిహాద్ పాకిస్థాన్(టీజేపీ) ప్రకటించింది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా శుక్రవారం కూడా పాకిస్థాన్‌లో ఉగ్రదాడి జరిగింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మరో 24 మంది గాయపడ్డారు.

Updated Date - 2023-11-04T12:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising