ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకెంతకాలం జరుగుతుంది.. ఎప్పుడు ముగుస్తుంది?

ABN, First Publish Date - 2023-09-17T15:09:34+05:30

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై.. ఏడాదిన్నర సమయం పైనే కావొస్తోంది. తొలుత ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేసి రష్యా ఆధిపత్యం చెలాయించగా.. ఆ తర్వాత ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల...

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై.. ఏడాదిన్నర సమయం పైనే కావొస్తోంది. తొలుత ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేసి రష్యా ఆధిపత్యం చెలాయించగా.. ఆ తర్వాత ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల సహకారంతో ఎదురుదాడుల్ని పెంచింది. మొదట్లో రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాల్ని ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన రష్యా.. తన దాడుల్ని మరింత పెంచింది. ఉక్రెయిన్‌ని బలహీనపరిచేందుకు.. ప్రధాన కార్యాలయాలను టార్గెట్ చేసుకొని, డ్రోన్ దాడులకు ఎగబడుతోంది. తానూ ఏం తక్కువ తినలేదన్నట్టు.. ఉక్రెయిన్ సైతం ఈ దాడుల్ని తిప్పికొడుతోంది.


ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. అసలు ఈ యుద్ధం ఇంకెంత కాలం సాగుతుంది? అసలు దీనికి ముగింపంటూ లేదా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. అయితే.. తాజాగా ఈ అంశంపై నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగదని, ఇది సుదీర్ఘకాలం కొనసాగుతుందని కుండబద్దలు కొట్టాడు. ప్రపంచ దేశాల్లోనూ ఇదే అభిప్రాయం నెలకొందని ఆయన పేర్కొన్నాడు. ఉక్రెయిన్ దూకుడు పెంచి రష్యాపై ప్రతిదాడులు మొదలుపెట్టడం వల్ల.. ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు. జర్మనీకి చెందిన ఓ మీడియా గ్రూప్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టోల్టెన్‌బర్గ్ మాట్లాడుతూ.. ‘‘చాలా యుద్ధాలు మొదలైనప్పుడు, ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. కాబట్టి.. ఉక్రెయిన్‌లో సుదీర్ఘ యుద్ధానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి’’ అని తెలిపారు.

ఉక్రెయిన్‌లో వీలైనంత త్వరగా శాంతి స్థాపించబడాలని తాను కోరుకుంటున్నానని స్టో్ల్టెన్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ, ఉక్రేనియన్లు తమ పోరాటం ఆపేస్తే.. అప్పుడు వారి దేశం తుడిచిపెట్టుకుపోతుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని అన్నారు. అయితే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ బలగాల్ని వెనక్కు రప్పిస్తే.. యుద్ధం సద్దుమణుగుతుందని పేర్కొన్నారు. ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి మాట్లాడుతూ.. తప్పకుండా ఆ దేశం నాటోలో ఉంటుందనడంలో సందేహం లేదన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు అవసరమని.. లేకపోతే చరిత్ర పునరావృతమవుతుందని స్టోల్టెన్‌బర్గ్ హెచ్చరించారు.

Updated Date - 2023-09-17T15:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising