ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Christmas: క్రిస్మస్ వేళ మూగబోయిన ఏసు క్రీస్తు జన్మస్థలం

ABN, Publish Date - Dec 26 , 2023 | 09:04 AM

క్రిస్మస్ వేళ కళకళలాడాల్సిన ఏసు క్రీస్తు జన్మస్థలం బెత్లెహం మూగబోయింది. పండుగ పర్వదినం వేళ రద్దీతో కిక్కిరిసిపోయి ఉండాల్సిన ఏసు ప్రభు పుట్టిన నేల నిశబ్దంగా ఉండిపోయింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం క్రిస్మస్ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపింది.

బెత్లెహం: క్రిస్మస్ వేళ కళకళలాడాల్సిన ఏసు క్రీస్తు జన్మస్థలం బెత్లెహం మూగబోయింది. పండుగ పర్వదినం వేళ రద్దీతో కిక్కిరిసిపోయి ఉండాల్సిన ఏసు ప్రభు పుట్టిన నేల నిశబ్దంగా ఉండిపోయింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం క్రిస్మస్ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపింది. యుద్దం కారణంగా బెత్లెహం నగరానికి పర్యాటకులు ఎవరూ రాలేదు. సాధారణంగా క్రిస్మస్ పర్వదినం వేళ బెత్లెహం నగరంలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. కానీ ఈ సారి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఏసు క్రీస్తు భక్తులు, పర్యాటకులు ఎవరూ కూడా బెత్లెహంకు వెళ్లలేదు. దీంతో ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో కలకళలాడే స్థానిక హోటల్స్, మాల్స్, రెస్టారెంట్లు వెలవెలబోయాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రభావం ఈ బెత్లెహం ప్రాంతంపై భారీగా పడింది.


బెత్లెహంలో క్రిస్మస్ వేడుకలు జరగకపోవడంతో స్థానికులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా పర్యాటక రంగం పైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఇక్కడి చర్చ్​లను, చారిత్రక కట్టడాలను చూసేందుకు విదేశీయులు వస్తేనే వీరి వ్యాపారం జరుగుతుంది. కానీ ఈ సారి యుద్ధం కారణంగా పర్యాటకులు ఎవరూ రాకపోవడంతో వారి జీవనోపాధి దెబ్బతింది. "ఈసారి మాకు అతిథులు లేరు. ఒక్కరు కూడా రాలేదు" అని అలెగ్జాండర్ అనే​ హోటల్ యజమాని తెలిపారు.​'మా పూర్వికుల నుంచి అందరం ఇక్కడే ఉంటున్నాము. నేను చూసిన అతి ఘోరమైన క్రిస్మస్ ఇదే. ఈ సారి క్రిస్మస్​చెట్టు లేదు. సంతోషం లేదు' అని మరొకరు అన్నారు. "అక్టోబర్​7కి ముందు పరిస్థితులు అన్ని బాగానే ఉండేవి. క్రిస్మస్ ​బుకింగ్స్‌తో అప్పటికే హెటల్ గదులన్నీ నిండిపోయాయి. ఇంకా డిమాండ్​ ఉండటంతో తాత్కాలిక ఏర్పాట్లు చేయాలేమో అని కూడా భావించాను. కానీ యుద్ధం కారణంగా బుకింగ్స్‌ని రద్దు చేసుకున్నారు. వచ్చే ఏడాది బుకింగ్స్​ కూడా రద్దైపోయాయి" అని జో కనవాటీ అనే వ్యక్తి వివరించారు.

కాగా అక్టోబర్​7న ఇజ్రాయెల్‌పై హమాస్​బృందం దాడి చేయడంతో మొదలైన ఉద్రిక్తత పరిస్థితులు ఇప్పటికీ కొనసాతున్నాయి. హమాస్‌ను అంతం చేసేందుకు గాజాపై ఇజ్రాయెల్ బీభత్సంగా దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాంతాల్లో పర్యటనకు అక్కడి ప్రజలతో పాటు విదేశీయులు దూరంగా ఉంటున్నారు. ఈ యుద్ధం కారణంగా రెండు వైపుల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. వేలాది మంది చనిపోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Updated Date - Dec 26 , 2023 | 11:29 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising