Home » Gaziantep
క్రిస్మస్ వేళ కళకళలాడాల్సిన ఏసు క్రీస్తు జన్మస్థలం బెత్లెహం మూగబోయింది. పండుగ పర్వదినం వేళ రద్దీతో కిక్కిరిసిపోయి ఉండాల్సిన ఏసు ప్రభు పుట్టిన నేల నిశబ్దంగా ఉండిపోయింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం క్రిస్మస్ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గాజాలో తమ వద్ద బందీలుగా ఉన్న మరో ఇద్దరు ఇజ్రాయెల్ మహిళలను హమాస్ విడుదల చేసింది.
ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రాంతం ధ్వంసమైంది. వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడడంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. అనేక భవనాలు, ఇళ్లు నేల కూలి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. పరిస్థితులు చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రెండు వైపుల నుంచి వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.