ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: పాకిస్థాన్ దేశంలో కల్లోలం... ప్రధాని షెహబాజ్ వాహనాలపై ఇమ్రాన్ మద్దతుదారుల పెట్రోల్ బాంబులు

ABN, First Publish Date - 2023-05-11T12:16:20+05:30

పాకిస్థాన్ దేశంలో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో కల్లోలం చెలరేగింది...

Pakistan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ దేశంలో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో కల్లోలం చెలరేగింది.(Pakistan) అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఘటనతో పలు నగరాల్లో అతని మద్దతుదారులు,పోలీసుల మధ్య దాడులకు దారితీసింది. ఈ దాడుల్లో ఆరుగురు వ్యక్తులు మరణించగా, పలువురు గాయపడ్డారు. విభజన తర్వాత పాక్ లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.

1947వ సంవత్సరం నుంచి పాకిస్థాన్ దేశంలో 19 మంది ప్రధానమంత్రులు పనిచేయగా, ఎవరూ ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేయలేదు.పలువురు ప్రధానమంత్రులను పదవీలో నుంచి దిగాక అరెస్టులు జరిగాయి. ప్రస్థుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా జైలుకు వెళ్లి వచ్చారు. మాజీ కెప్టెన్ అయిన ఇమ్రాన్ ఖాన్ పై 140 కేసులు నమోదవడంతో అరెస్టు అయ్యారు. గతంలో ప్రధానిగా పనిచేసిన అబ్బాసీ, నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో, జుల్ఫీకర్ అలీ భుట్టోలు అరెస్టయ్యారు.

ఇది కూడా చదవండి : Finland: ఫిన్లాండ్ ప్రధానమంత్రి సన్నామారిన్ భర్తకు విడాకులు

ఆగ్రహించిన నిరసనకారులు బుధవారం పాకిస్తాన్‌లోని రేడియో స్టేషన్‌పై దాడి చేశారు. ఇస్లామాబాద్ రాజధానిలో ఇమ్రాన్ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(PM Shehbaz Sharif) లాహోర్ నివాసంపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారు.(Imran Khans supporters hurl petrol bombs) కాగా తన అరెస్టు చట్టబద్ధమైనదని ఇస్లామాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇమ్రాన్‌ఖాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్ దేశంలో నిరంతర హింసాత్మక సంఘటనలు, అంతర్యుద్ధం కారణంగా భారతదేశంలో సరిహద్దు భద్రతా దళాలు (BSF) అప్రమత్తం చేశారు.ఇమ్రాన్ మద్దతుదారులకు, పోలీసు బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో వందలాది మంది గాయపడ్డారు.దీంతో పాకిస్థాన్‌లో అశాంతి నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత నగరాల్లో జరిగిన అల్లర్లను పీపీపీ నాయకుడు, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఖండించారు.

Updated Date - 2023-05-11T12:16:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising