ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Russia-Ukraine War: యుద్ధం ఎప్పుడు ముగుస్తుందంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ క్లారిటీ

ABN, Publish Date - Dec 20 , 2023 | 04:50 PM

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై 20 నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరిపై మరొకరు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. దీంతో..

Volodymyr Zelenskyy On Russia War: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై 20 నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరిపై మరొకరు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. దీంతో.. ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడు? అనే ప్రశ్న మిస్టరీగానే మారింది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ కూడా ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని కుండబద్దలు కొట్టారు. అయితే.. కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొని ముందుకు దూసుకెళ్తే, ఈ యుద్ధంలో ఉక్రెయిన్ వేగంగా విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

‘‘రష్యాతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? అనే ప్రశ్నకు ఎవరికీ సమాధానం తెలియదని నేను అనుకుంటున్నాను. ఉక్రెయిన్ ప్రజలకు, సైనిక కమాండర్లకు, మాకు మద్దతు తెలుపుతున్న పాశ్చాత్య భాగస్వాములకు కూడా ఆ ప్రశ్నకు జవాబు తెలియదు. అయితే.. మా లక్ష్యం నెరవేరే వరకు మేము వెనకడుగు వేయబోం. ఈ కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొని ముందుకు సాగగలిగితే.. కచ్ఛితంగా వీలైనంత త్వరగా ఈ యుద్ధంలో గెలిచి తీరుతాం’’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఇదే సమయంలో.. రష్యాతో జరుగుతున్న యుద్ధం కోసం కొన్ని లక్షల మంది ఉక్రేనియన్లను సమీకరించాల్సిందిగా తనకు సైన్యం నుంచి అభ్యర్థన వచ్చిందని తెలిపారు.


‘‘నాలుగున్నర నుంచి ఐదు లక్షల మంది ఉక్రెయిన్ పౌరుల్ని సైన్యంలో చేర్చుకోవాలని ఉక్రెయిన్ సైనిక నాయకత్వం ప్రతిపాదించింది. అయితే.. ఈ ప్రతిపాదనని నేను తిరస్కరించాను. ఈ ఆలోచనకు మద్దతు ఇవ్వడానికి మరిన్ని వాదనలు అవసరం’’ అని జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు. అలాగే.. నల్ల సముద్రంపై రష్యా యుద్ధనౌకలపై తమ సైన్యం చేసిన దాడుల్ని ‘పెద్ద విజయం’గా ఆయన అభివర్ణించారు. ఈ దాడుల కారణంగా సముద్ర వాణిజ్య మార్గాలు సురక్షితం అయ్యాయని చెప్పారు. రష్యన్ నౌకాదళం ఉక్రేనియన్ నల్ల సముద్రంలో దాదాపు పూర్తి ఆధిపత్యాన్ని కోల్పోయిందని, ఇది అభినందించదగిన విషయమని అన్నారు.

తాము ఏం చేయాలి? ఎలాంటి వస్తువుల్ని ఎగుమతి చేయాలి? అనే విషయాలపై రష్యా ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించిందని.. తమ ఉక్రెయిన్ సైన్యం ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టిందని జెలెన్‌స్కీ అభినందించారు. ఈ యుద్ధంలో అమెరికా తమకు పూర్తి సహాయం అందిస్తుందని తనకు విశ్వాసం ఉందని, తమకు ద్రోహం చేయదని భావిస్తున్నానని అన్నారు. కాకపోతే.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉక్రెయిన్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. తాము ఈ యుద్ధంలో నెగ్గేదాకా పోరాడుతూనే ఉంటామని, వెనకడుగు వేసేదే లేదని జెలెన్‌స్కీ తేల్చి చెప్పారు.

Updated Date - Dec 20 , 2023 | 04:50 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising