Zelensky : పుతిన్ సజీవంగా ఉన్నాడో లేదో తెలియదు...జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-01-21T10:15:16+05:30
ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు....
దావోస్ : ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.(Volodymyr Zelensky)రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఇంకా బతికే ఉన్నారో లేదో ఖచ్చితంగా తెలియదని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. వ్లాదిమిర్ పుతిన్ గత కొన్ని వారాలుగా బహిరంగ ప్రదర్శనలకు దూరంగా ఉన్నారని ఆయన చెప్పారు. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)(World Economic Forum in Davos) సదస్సులో జెలెన్స్కీ గురువారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
శాంతి చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయని అడిగినపుడు జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ వ్యాఖ్యల వీడియో ట్విట్టర్లో కనిపించింది.‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్ సజీవంగా ఉన్నాడా?, అతను నిర్ణయాలు తీసుకుంటున్నాడా లేదా అక్కడ ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు’’ ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు.
Updated Date - 2023-01-21T10:38:41+05:30 IST