ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel- Hamas: హమాస్ నరమేధంపై జో బైడెన్ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-10-12T14:21:38+05:30

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

వాషింగ్టన్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు చిన్న పిల్లల తలలను నరికే చిత్రాలను చూస్తానని తాను జీవితంలో ఎన్నడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హమాస్ ఉగ్రవాదులది అత్యంత పాశవికమైన దాడిగా అభివర్ణించారు. జీవితంలో ఇలాంటి అత్యంత ఘోర కలిని చూడాల్సి రావడంతో ఆవేదన చెందారు. బైడెన్ వ్యాఖ్యలపై వైట్‌హౌజ్ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. హమాస్ ఉగ్రవాదుల ఘోరాలకు సంబంధించిన చిత్రాలను జో బైడెన్ స్వయంగా చూడలేదని తెలిపారు. హమాస్ ఉగ్రవాదులు సృష్టిస్తున్న విధ్వంసానికి సంబంధించి అందిన వివరాల ఆధారంగా బైడెన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో పలువురు అమెరికా పౌరులు కూడా చనిపోయినట్లు బైడెన్ ధృవీకరించారు. గత శనివారం ఇజ్రాయోల్‌లోకి ప్రవేశించిన హమాస్ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. వందల మందిని బందీలుగా చేసుకుని వారిని అత్యంత దారుణంగా చంపేశారని ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) ప్రకటించింది. ఈ నేపథ్యంలో బైడెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


మరోవైపు హమాస్ (పాలస్తీనా ఉగ్రవాద సంస్థ) తమపై మెరుపుదాడి చేయడం, ఎందరో ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా గాజాకు తీసుకెళ్లడంతో తీవ్ర కోపాద్రిక్తులైన ఇజ్రాయెల్ దేశం.. ఎట్టి పరిస్థితుల్లోనైనా ‘హమాస్’ని మట్టుబెట్టాలని కఠిన నిర్ణయం తీసుకుంది. గాజాలోని వారి రహస్య స్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేసి.. హమాస్ ఉనికి లేకుండా చేయాలని పూనుకుంది. ఇందులో భాగంగానే.. ఇజ్రాయెల్ దళాలు (ఐడీఎఫ్) ‘నాక్‌ ఆన్‌ ది రూఫ్‌’ అనే విధానానికి మంగళం పాడేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం.. గాజాలో భారీగా రక్తపాతం తప్పదు. అంటే.. హమాస్ మిలిటెంట్లనే కాదు, గాజావాసుల్ని కూడా లెక్కచేయకుండా ఇజ్రాయెల్ దళాలు నరమేధం సృష్టిస్తారు.

Updated Date - 2023-10-12T14:21:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising