ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Biden: రష్యాకు షాకిచ్చిన బైడెన్.. అకస్మాత్తుగా కీవ్‌లో ప్రత్యక్షం

ABN, First Publish Date - 2023-02-20T16:19:53+05:30

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) రష్యాకు (Russia) షాకిచ్చారు. అకస్మాత్తుగా ఆయన ఉక్రెయిన్‌లో(Ukraine) ప్రత్యక్షమయ్యారు.

USA President Joe Biden lands in Ukraine
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) రష్యాకు (Russia) షాకిచ్చారు. అకస్మాత్తుగా ఆయన ఉక్రెయిన్‌లో(Ukraine) ప్రత్యక్షమయ్యారు. కీవ్‌లో(Kyiv) ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో (President Zelenskyy) సమావేశమయ్యారు. రష్యా కారణంగా మరణించిన సైనికుల స్మారకం వద్ద నివాళులర్పించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది అయింది. ఈ తరుణంలో రెండు దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో బైడెన్ అకస్మాత్తుగా ఉక్రెయిన్‌లో పర్యటించడం కలకలం రేపుతోంది. ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు తెలిపేందుకు బైడెన్ వచ్చినట్లు భావిస్తున్నారు. భయపడవద్దని, తామున్నామని భరోసా ఇచ్చేందుకే బైడెన్ ఆలస్యంగానైనా ఉక్రెయిన్‌లో అడుగుపెట్టారు. బైడెన్ పర్యటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) ఎలా స్పందిస్తారోనని అంతర్జాతీయ పరిశీలకులు ఎదురుచూస్తున్నారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడొకరు ఉక్రెయిన్‌లో పర్యటించడం 2008 తర్వాత ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా బైడెన్ ఉక్రెయిన్‌కు భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. 500 మిలియన్ డాలర్లను ఆయన సాయంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బైడెన్ ఉక్రెయిన్ పర్యటన కారణంగా రష్యాతో అమెరికా సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలను అంతర్జాతీయ పరిశీలకులు తోసిపుచ్చడం లేదు.

అమెరికా ఇప్పటికే 54 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించింది. అమెరికాకు చెందిన యుద్ధవిమానాలు, ట్యాంకులు, లాంగ్‌రేంజ్‌ మిసైల్స్‌ అందించాలని ఉక్రెయిన్ కోరుతోంది. ఈ దిశగా బైడెన్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని పరిశీలకులు ఎదురుచూస్తున్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రెండు దేశాల్లోనూ వేలాది మంది చనిపోయారు. లక్షలాది మంది ఇతర దేశాలకు వలసపోయారు. మన దేశానికి చెందిన విద్యార్ధులతో పాటు ఇతర దేశాల విద్యార్ధులు చదువులు మధ్యలో ఆపేసి వారి వారి స్వదేశాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. యుద్ధవేళ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్ధులను మోదీ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా భారత్‌కు తరలించింది. మన దేశానికి చెందిన విద్యార్ధులతో పాటు ఇతర దేశాల విద్యార్ధులను కూడా భారత్ స్వదేశానికి తీసుకువచ్చింది. యుద్ధాలు తగవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా-ఉక్రెయిన్ దేశాల నాయకులకు స్పష్టం చేశారు. శాంతియుతంగా చర్చలు జరిపి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

Updated Date - 2023-02-20T16:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising