ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IT Raids: ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు.. ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం

ABN, First Publish Date - 2023-12-09T14:19:05+05:30

దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఐటీ దాడుల్లో(IT Raids) నోట్ల గుట్టలు బయటపడుతన్నాయి. ఒడిశా, జార్ఖండ్ లలోని డిస్టిలరీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.

ఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఐటీ దాడుల్లో(IT Raids) నోట్ల గుట్టలు బయటపడుతన్నాయి. ఒడిశా, జార్ఖండ్ లలోని డిస్టిలరీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.290 కోట్లు పట్టుబడ్డాయి. ఒక్క ఆపరేషన్లోనే ఇంత నల్లధనం పట్టుబడటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

నోట్ల లెక్కింపు కోసం ఇవాళ ఐటీ శాఖ 40 యంత్రాలను వినియోగించింది. పట్టుబడిన డబ్బును ప్రభుత్వ బ్యాంకులకు తరలించే ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ కంపెనీ అధికారులు, ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తున్నారు.

జార్ఖండ్ కి చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహూ ఇంటిని కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు. నగదు లెక్కింపు ఇవాళ్టితో ముగియనుంది. ఒడిశాలోని లిక్కర్ డిస్టిలరీ గ్రూపులపై ఐటీ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది.బొలంగీర్ జిల్లాలోని సుదాపరాలో మద్యం తయారు చేస్తున్న కొందరి నివాసం నుండి శనివారం 20 బ్యాగ్ ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2023-12-09T14:30:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising