ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bus Accident: రెండు బస్సులు ఢీకొని ఇద్దరు మృతి, 70 మందికి గాయాలు

ABN, First Publish Date - 2023-06-19T14:24:28+05:30

తమిళనాడులోని కడలూరులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేటు బస్సులు ఢీకొని ఇద్దరు ప్రయాణికులు మృతిచెందగా, 70 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కడలూరు: తమిళనాడు(Tamilnadu)లోని కడలూరులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేటు బస్సులు ఢీకొని (Buses Collision) ఇద్దరు ప్రయాణికులు మృతిచెందగా, 70 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పన్రుతిలోని మెల్‌పట్టంపాక్కం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో రెండు బస్సులు ముందు భాగం బాగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. బస్సుల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి అంబులెన్సులలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి వెంటనే కారణాలు తెలియలేదు.

కాగా, ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సులు ఎదురెదురుగా వస్తున్న సమయంలో ఒక బస్సు టైరు పేలిపోవడంతో అదుపు తప్పి మరో బస్సు మీదకు దూసుకుపోయినట్టు తెలుస్తోందని పోలీసులు చెప్పారు. సీనియర్ జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఘటనా స్థలి వద్ద సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2023-06-19T15:29:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising