ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China : చైనాను కుదిపేసిన భారీ భూకంపం

ABN, First Publish Date - 2023-02-23T10:56:31+05:30

చైనా (China)లోని జింజియాంగ్ వీఘర్ అటానమస్ రీజియన్‌ (Xinjiang Uygur Autonomous Region) గురువారం

China Earthquake
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ : చైనా (China)లోని జింజియాంగ్ వీఘర్ అటానమస్ రీజియన్‌ (Xinjiang Uygur Autonomous Region) గురువారం తీవ్ర భూకంపంతో విలవిలలాడింది. చైనా స్టేట్ మీడియా కథనం ప్రకారం గురువారం 7.3 తీవ్రతతో భూమి కంపించింది. అయితే అమెరికన్ జియొలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప లేఖినిపై దీని తీవ్రత 6.8 అని తెలుస్తోంది. ఇది తజకిస్ఠాన్ సరిహద్దుల్లోని ముర్ఘబ్‌కు పశ్చిమ దిశలో 67 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. భూమి లోపల 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. పామిర్ కొండ ప్రాంతంలో సుమారు కొన్ని వందల మంది నివసించే ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది.

చైనా ఎర్త్‌క్వేక్ నెట్‌వర్క్స్ సెంటర్ కథనం ప్రకారం తజకిస్థాన్‌ (Tajikistan)ను గురువారం భూకంపం కుదిపేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. దీని కేంద్రం భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఉంది.

ఇదిలావుండగా, ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం జరిగిందా? లేదా? అనే సమాచారం ఇంకా రాలేదు.

ఇవి కూడా చదవండి :

PG Medical Student: వెంటిలేటర్‌‌పైనే ప్రీతికి చికిత్స

Biryani: బిర్యానీ ప్రియులకు అలర్ట్.. అక్కడ తిన్నారో..?!

Updated Date - 2023-02-23T10:56:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising