ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress : కాంగ్రెస్‌కు కొత్త పునాది!

ABN, First Publish Date - 2023-01-30T02:08:27+05:30

భారత జాతిని ఏకం చేసే లక్ష్యంతో చేపట్టి, దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ ముగిసింది. సోమవారం శ్రీనగర్‌లో పలు ప్రతిపక్ష పార్టీల నేతలతో కలిసి ప్రసంగించడం ద్వారా ఈ యాత్రకు రాహుల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగిసిన రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర

పార్టీకి ఉనికి కల్పించారంటున్న నేతలు..

సార్వత్రిక ఎన్నికలకు ప్రయాణం ప్రారంభం

కర్ణాటకలో సత్తా చాటుకునేందుకు అవకాశం..

రాహుల్‌ అన్ని పక్షాల్నీ ఆకట్టుకోలేదన్న విమర్శ

కొన్ని పార్టీలు దూరంగా ఉండడమే నిదర్శనం..

12 పార్టీలతోనే నేడు యాత్ర ముగింపు సభ

న్యూఢిల్లీ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): భారత జాతిని ఏకం చేసే లక్ష్యంతో చేపట్టి, దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ ముగిసింది. సోమవారం శ్రీనగర్‌లో పలు ప్రతిపక్ష పార్టీల నేతలతో కలిసి ప్రసంగించడం ద్వారా ఈ యాత్రకు రాహుల్‌ ముగింపు పలకనున్నారు. కాగా, ఈ యాత్ర ఇచ్చిన ఉత్సాహంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ఉధృతంగా పాల్గొంటారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. అయితే రాహుల్‌ యాత్ర మాత్రమే ముగిసిందని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా తలపడే ప్రయాణం మాత్రం ఇప్పుడే ప్రారంభమైందని మరికొందరు నేతలు చెబుతున్నారు. కాగా, సోమవారం నిర్వహించే ముగింపు సభకు దేశంలోని 21 ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించగా.. వీటిలో 12 పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే), సీపీఎం, సీపీఐ, వీసీకే, కేరళ కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, జేఎంఎం పార్టీల నేతలు సభకు హాజరవుతారని పేర్కొన్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీ, తెలుగు దేశం పార్టీ ప్రతినిధులను కూడా ఆహ్వానించినప్పటికీ.. వారు హాజరు కావడం లేదని తెలిపాయి. దీంతో రాహుల్‌ జోడో యాత్ర కాంగ్రెసేతర పక్షాలన్నింటినీ ఆకట్టుకోలేకపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్‌ వారిలో విశ్వాసం కలిగించలేకపోయారని, తన యాత్ర ద్వారా దేశంలో బీజేపీయేతర ఫ్రంట్‌కు నాయకత్వం వహించే శక్తిని ఆయన సంపాదించలేకపోయారని అంటున్నారు. రాహుల్‌గాంధీ మాత్రం తాను చేపట్టిన భారత్‌ జోడో యాత్ర.. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు జాతీయ స్థాయి ప్రభావాన్ని సృష్టించిందని ఆదివారం ప్రకటించారు. కొన్ని విభేదాలున్నా.. ప్రతిపక్షాలన్నీ ఆర్‌ఎ్‌సఎ్‌స-బీజేపీని ఎదుర్కొనేందుకు ఏకమవుతాయని పేర్కొన్నారు.

అందరివాడినని చాటుకునే ప్రయత్నం..

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ దాకా సాగిన భారత్‌ జోడో యాత్రను గత ఏడాది సెప్టెంబరు 7న ప్రారంభించిన రాహుల్‌గాంధీ.. దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గుండా 145 రోజులపాటు 4080 కిలోమీటర్ల దూరం నడిచారు. యాత్రలో అనేక కీలక జాతీయ అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా దేశ ప్రజల్లో బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ విద్వేష భావాల్ని రేకెత్తిస్తున్నాయంటూ వాటి తీరును ఎండగట్టారు. దేశంలో ఉదారవాద, ప్రగతిశీల రాజకీయాలను ఆశిస్తున్న అనేక మంది తటస్థులు, మేధావులు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు రాహుల్‌తో చేయి కలిపి నడిచారు. అన్ని కులాలు, మతాల వారితో మాట్లాడగలగడం, అన్ని మతాల మందిరాలను సందర్శించడం, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి సమాధిని కూడా సందర్శించడం ద్వారా రాహుల్‌గాంధీ దేశంలో తాను అన్ని వర్గాలకు చెందిన వాడిగా రుజువు చేసుకునే ప్రయత్నం చేశారు. రాహుల్‌ యాత్ర రాజకీయాలకు అతీతమైనదని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నా.. దేశంలో బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులన్నింటినీ తన యాత్ర ద్వారా కూడగట్టుకోగలిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగం, రైతుల సమస్యలు,తీవ్రతరమవుతున్న అసమానతలు, పెరుగుతున్న ధరలు, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, చైనా దురాక్రమణను అడ్డుకోలేకపోవడం కార్పొరేట్ల ఉచ్చులో దేశం ఇరుక్కోవడం గురించి చర్చను రాహుల్‌ రేకెత్తించగలిగారు.

ఉనికి కోల్పోతున్న పార్టీకి యాత్రతో పునాది..

తన పాదయాత్ర ద్వారా దేశంలో కాంగ్రె్‌సను బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా రాహుల్‌ తీర్చిదిద్దలేకపోవచ్చునేమో గానీ.. ఉనికి కోల్పోతుందనుకున్న పార్టీకి కొత్త పునాది కల్పించారని కాంగ్రె్‌సవాదులు భావిస్తున్నారు. పార్టీ భవిష్యత్తును నిర్మించేందుకు ఇంకా అవకాశాలున్నాయన్న ఆశలను రాహుల్‌ యాత్ర ద్వారా రేకెత్తించారని అంటున్నారు. ముఖ్యంగా ప్రజల్లో మోదీ ప్రభుత్వం తీరుతెన్నుల పట్ల ఒక ఆలోచనను కలిగించడంలో రాహుల్‌ కృతకృత్యులయ్యారని, ఈ యాత్ర కల్పించిన పునాది ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతమయ్యేందుకు అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. భారత్‌ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్‌ సత్తా నిరూపించుకునేందుకు అవకాశం కల్పించనున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కర్ణాటకలో విజయం సాధిస్తే దేశంలో ప్రత్యామ్నాయ కూటమికి రాహుల్‌ నేతృత్వం వహించేందుకు ఆస్కారం కలుగుతుందని అంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి వివిధ ప్రతిపక్షాలు కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏకమయ్యేందుకు తగిన వాతావరణాన్ని రాహుల్‌ కల్పించారని పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి కొన్ని పార్టీలు సందేహంలో ఉన్నా.. భవిష్యత్తులో కాంగ్రె్‌సతో కలిసి పనిచేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని వారు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2023-01-30T03:51:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising