ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Swiss Woman: ఒకే ఒక్క ఆధారంతో కన్నతల్లి కోసం పదేళ్లుగా ముంబైలో వెతుకుతున్న స్విట్జర్లాండ్ యువతి..

ABN, Publish Date - Dec 21 , 2023 | 05:08 PM

కడుపులో తొమ్మిది నెలలు మోసి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన కన్నతల్లిని చూడాలని, కలవాలని ఓ స్విట్జర్లాండ్ యువతి పరితపిస్తోంది. గత పదేళ్లలో మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలో వెతుకుతోంది. అయితే ఆ యువతి వద్ద ఉన్న ఏకైక క్లూ తల్లి ఇంటి పేరు, అడ్రస్ మాత్రమే. అయితే ఆ అడ్రస్ ఇప్పుడు లేకపోవడంతో యువతి చాలాకాలంగా ముంబై నగరాన్ని గాలిస్తోంది.

ముంబై: కడుపులో తొమ్మిది నెలలు మోసి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన కన్నతల్లిని చూడాలని, కలవాలని ఓ స్విట్జర్లాండ్ యువతి పరితపిస్తోంది. గత పదేళ్లలో మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలో వెతుకుతోంది. అయితే ఆ యువతి వద్ద ఉన్న ఏకైక క్లూ తల్లి ఇంటి పేరు, అడ్రస్ మాత్రమే. అయితే ఆ అడ్రస్ ఇప్పుడు లేకపోవడంతో యువతి నిరంతరాయంగా ముంబై నగరాన్ని గాలిస్తోంది. కన్నతల్లిని చూడాలని ఇంతలా ఎదురుచూస్తున్న ఆ యువతి పేరు విద్యా ఫిలిప్పాన్. ఆమె ఫిబ్రవరి 8, 1996లో పుట్టింది. అయితే తల్లి ముంబైలోని ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ వద్ద వదిలిలేసి వెళ్లిపోయింది. 1997లో స్విట్జర్లాండ్‌కు చెందిన జంట ఫిలిప్పాన్‌ను దత్తత తీసుకుంది. వారితోపాటే ఆమెను స్విట్జర్లాండ్ తీసుకెళ్లారు.

అయితే తన మూలాలు తెలుసుకునేందుకు విద్యా ఫిలిప్పాన్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇండియాకు వచ్చిన ముంబైలోని రావల్ పడా, దహిసార్ ప్రాంతాల్లో తల్లి కోసం అన్వేషిస్తోంది. తల్లి వదిలి పెట్టిన ప్రాంతం ‘విలే పార్లే’ ఏరియాలోని మథర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్‌లను ఇప్పటికే సందర్శించింది. తల్లి నివసించిన దహిసార్ ప్రాంతాన్ని కూడా సందర్శించినప్పటికీ తన వద్ద ఉన్న అడ్రస్ ఇప్పుడు మనుగడలో లేదు. అయితే ఏదో ఒక రోజు తప్పకుండా తన మాతృమూర్తిని కలుస్తానని ఆమె ఆశగా చెబుతోంది.


ఫిలిప్పాన్‌‌కు డైరెక్టర్ ఆఫ్ అడాప్టీ రైట్స్ కౌన్సిల్ అడ్వకేట్ అంజలి పవార్ సాయం చేస్తున్నారు. తల్లిని వెతుకుతూ స్విట్జర్లాండ్ నుంచి భారత్‌కు వచ్చిన ఫిలిప్పాన్‌కు సాయం చేస్తున్నామని అంజలీ పవార్ తెలిపారు. ఈ విషయంలో మిషనరీ ఛారిటీ సాయం చేసిందని, కొంత సమాచారం ఇచ్చిందని, అయితే వారు ఇచ్చిన అడ్రస్ ప్రస్తుతం మారిపోయిందని అంజలీ పేర్కొన్నారు.

ఫిలిప్పాన్ తల్లి అన్వేషణలో సాయం చేయాలని ప్రజలను కోరుతున్నామని, తమకు సాయం అందిస్తున్న ఒక సామాజిక కార్యకర్తకు కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చామని ఆమె వివరించారు. ఫిలిప్పాన్ తల్లికి సంబంధించి పెద్దగా సమాచారంలేదని, ఆమె ఇంటి పేరు ‘కాంబ్లీ’ అని చెప్పారు. దహిసార్ ప్రాంతంలో 1996-97 సమయంలో నివసించిన వారు తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా తనకు జన్మనిచ్చినప్పుడు తల్లి వయసు 20 సంవత్సరాలని, పదేళ్లుగా ఆమె కోసం గాలిస్తున్నానని విద్యా ఫిలిప్పాన్ చెప్పింది. తన భర్తతో కలిసి భారత్‌కు వచ్చానని, తన కుటుంబం ఇంటి పేరు కాంబ్లీ అని, ఏదైనా సమాచారం ఉంటే అందించాలని విద్యా కోరింది.

Updated Date - Dec 21 , 2023 | 05:10 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising