ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhya Pradesh : మూడు బస్సులను ఢీకొట్టిన లారీ... 15 మంది మృతి... 61 మందికి గాయాలు...

ABN, First Publish Date - 2023-02-25T13:05:02+05:30

మధ్య ప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న మూడు బస్సులను ఓ లారీ ఢీకొనడంతో 15 మంది

Madhya Pradesh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మధ్య ప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న మూడు బస్సులను ఓ లారీ ఢీకొనడంతో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 61 మంది గాయపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) బహిరంగ సభలో పాల్గొన్నవారు తిరిగి ఈ బస్సులలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతులంతా సిద్ధి జిల్లావాసులేనని అధికారులు తెలిపారు. అయితే ఐదు మృతదేహాలకు సంబంధించిన వివరాలను గుర్తించలేదని పేర్కొన్నారు. మృతుల్లో ఒకరు హాస్టల్ సూపరింటెండెంట్ అని తెలిపారు. గాయపడినవారిలో పది మంది టీచర్లు, ఏడుగురు పట్వారీలు ఉన్నట్లు తెలిపారు. ఓ పోలీసు కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.

ఈ మూడు బస్సుల్లోనూ సుమారు 200 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. మధ్య ప్రదేశ్‌లోని రేవా-సాత్నా సరిహద్దులో ఈ ప్రమాదం జరిగింది. రేవా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Chief Minister Shivraj Singh Chouhan) పరామర్శించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్క వ్యక్తి కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడినవారికి రూ.1 లక్ష చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఇవి కూడా చదవండి :

For Onions: ఉల్లి రైతుల కన్నీళ్లు.. పాపం.. చచ్చిపోవడానికి అనుమతి అడుగుతున్నారంటే..

DRDO : సెక్స్ కోసం పాకిస్థానీ గూఢచారికి రహస్య సమాచారం ఇచ్చేసిన డీఆర్డీఓ అధికారి

Updated Date - 2023-02-25T13:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising