ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Aadhaar update: ఆధార్ అప్‌డేట్ చేశారా.. లేకుంటే ఇలా చేయండి.. వివరాలు ఇవే..

ABN, First Publish Date - 2023-04-14T18:45:08+05:30

మీరు ఆధార్ కార్డులో (Aadhaar card update) అడ్రస్, పుట్టినరోజు, మొబైల్ ఫోన్ నెంబర్ మార్చుకోవాలనుకుంటున్నారా... అయితే వెంటనే ఆ పని చేయండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: మీరు ఆధార్ కార్డులో (Aadhaar card update) అడ్రస్, పుట్టినరోజు, మొబైల్ ఫోన్ నెంబర్ మార్చుకోవాలనుకుంటున్నారా... అయితే వెంటనే ఆ పని చేయండి. మీ ఇంటికి సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవచ్చు. లేదా ఆన్ లైన్ యూఐడీఏఐ (UIDAI) ద్వారా కూడా ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు అప్ డేట్ ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలు కింద చూడవచ్చు.

ఆధార్ కార్డు అప్ డేట్ వివరాలు ఇలా ఉన్నాయి.

1. ఆధార్ అధికారిక వెబ్ సైట్ https://uidai.gov.in/లో వెళ్లి ఆధార్ అప్ డేట్ నుంచి మై ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి.

2. ఆధార్‌ను అప్‌డేట్ విభాగంలోకి వెళ్లి 'అప్‌డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా ఆన్‌లైన్'పై క్లిక్ చేయాలి.

3. అప్‌డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా ఆన్‌లైన్'పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. వెంటనే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తోంది.

4. మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని బాక్స్ లో ఎంటర్ చేసి క్లిక్ చేయాలి.

5. అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఫీల్డ్‌లను ఎంచుకోవాలి.

6. స్కాన్ చేసిన డాక్యూమెంట్ల సాఫ్ట్ కాపీలను అప్ లోడ్ చేయాలి. ఉదాహరణకు.. పాస్ పోర్టు, బ్యాంకు స్టేట్ మెంట్, కరెంట్ బిల్లులో ఏదైనా ఒకటి అప్ లోడ్ చేయాలి.

7. అప్ డేట్ చేసిన డాక్యుమెంట్లను సరిచూసుకోవాలి. సరైనా డాక్యుమెంట్ అప్ లోడ్ చేసినట్లు నిర్దారించుకున్న తర్వాత సమ్మిట్ చేయాలి.

8. స్క్రీన్‌పై జాబితా నుంచి బీపీవో సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి. ఆధార్ అప్‌డేట్ అభ్యర్థనలను పరిశీలించేదుకు UIDAI ద్వారా BPO సర్వీస్ ప్రొవైడర్‌లకు అధికారం ఉంటుంది.

9. ఆధార్ డాక్యుమెంట్ల అభ్యర్థనను నిర్ధారించిన తర్వాత సమ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.

10. ఆధార్ అప్ డేట్ డాక్యుమెంట్ల సమ్మిట్ చేసిన తర్వాత అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) వస్తోంది.

11. UIDAI వెబ్‌సైట్‌, UIDAI మొబైల్ యాప్ ద్వారా అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ ఉపయోగించి అధార్ అప్‌డేట్ వివరాలను తెలుసుకోవచ్చు.

ఆధార్ కార్డు అప్‌డేట్ అభ్యర్థనను పరిశీలించి ఆమోదించిన తర్వాత సవరించిన సమాచారంతో పోస్ట్ ద్వారా ఆధార్ కార్డ్‌ మీ ఇంటికి వస్తోంది.

Updated Date - 2023-04-14T18:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising