ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

I.N.D.I.A. alliance: పొత్తు ధర్మానికి కట్టుబడి ఉంటాం: కేజ్రీవాల్

ABN, First Publish Date - 2023-09-29T15:41:24+05:30

డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్టు అనంతరం 'ఇండియా' కూటమితో పొత్తు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు. 'ఇండియా' కూటమితో పొత్తుకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.

న్యూఢిల్లీ: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్టు అనంతరం 'ఇండియా' (I.N.D.I.A.) కూటమితో పొత్తు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పష్టత ఇచ్చారు. 'ఇండియా' కూటమితో పొత్తుకు తాము కట్టుబడి ఉన్నామని, మాదకద్రవ్యాలతో ఎవరికి సంబంధం ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదని శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.


''ఇండియా అలయెన్స్‌కు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తుకు దూరంగా ఉండేది లేదు. పంజాబ్ పోలీసులు కొందరు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. అందుకు సంబంధించిన వివారాలు నాదగ్గర లేవు. పంజాబు పోలీసులే చెప్పాలి. మాదకద్రవ్యాలపై మేము యుద్ధం ప్రకటించాం. వ్యక్తిగత కేసులు లేదా వ్యక్తుల గురించి నేను మాట్లాడదలచుకోలేదు. కానీ మాదక ద్రవ్యాల బెడదను నివారించేదుకు మాత్రం మేము కట్టుబడి ఉన్నాం. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాం. ఇందుకు పాల్పడే వ్యక్తులు ఎంతటి పెద్దవాళ్లయినా విడిచిపెట్టే ప్రసక్తి లేదు'' అని కేజ్రీవాల్ తెలిపారు.


పంజాబ్ పోలీసులు 2015లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద నమోదు చేసిన కేసుకు సంబంధించి ఖైరాను ఛండీగఢ్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ అరెస్టును రాజకీయ ప్రతీకార చర్యగా పంజాబ్ కాంగ్రెస్ ఆరోపిస్తూ భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. భగవంత్ మాన్ చర్యను తాను ఖండిస్తున్నామని, ఎప్పటికీ అధికారం తమదేనని మాన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది, ప్రతి ఒక్కరూ వెళ్లిపోవాల్సిందేనని, ఆయన ప్రభుత్వం కూడా ఇందుకు మినహాయింపు కాదని పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా మండిపడ్డారు. ఖైరాను కలుసుకునే రాజ్యాంగపరమైన హక్కు విపక్ష నేతగా తనకు ఉందని, పోలీసు కస్టడీలో ఉన్న ఆయనను కలుసుకునేందుకు తాము ప్రయత్నించినప్పటికీ తమను అనుమతించ లేదని చెప్పారు. ఖైరాను మర్యాదపూర్వకంగా తాము కలుసుకోవాలనుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు నేతలందరూ ఖైరా వెంటే ఉన్నారని, ఇంతకు మించి చెప్పేదేమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీంద్ సింగ్ రాజా వారింగ్ సైతం ఈ చర్యను ఖండించారు. ఇది రాజకీయ ప్రతీకార చర్యేనని అన్నారు. ఖైరాను తాము కలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పైనుంచి ఉత్తర్వులు ఉన్నాయని ఎస్ఎస్‌పీ చెబుతూ తమను చూసేందుకు నిరాకరించారని ఆయన తెలిపారు.


కాగా, కాంగ్రెస్ విమర్శలను పంజాబ్ ఆప్ సీనియర్ ప్రతినిధి జగ్తార్ సింగ్ ద్యాల్‌పుర తోసిపుచ్చారు. డ్రగ్స్ స్మగ్లర్లపై ఎలాంటి రాజీలేని వైఖరిని భగవత్ సింగ్ మాన్ ప్రభుత్వం అనుసరిస్తోందని, కాంగ్రెస్ నేతపై తగినని సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఖయిరా అరెస్టుతో 'ఇండియా' కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, ఆప్ మధ్య చిచ్చు రగలే అవకాశాలున్నాయని అంటుండగా, పంజాబ్‌లో ఆప్‌తో ఎలాంటి సీట్ల షేరింగ్ ఉండదని రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ చెబుతోంది.

Updated Date - 2023-09-29T15:41:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising