ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Actor Khushboo: మమ్మల్ని అనటం కాదు.. ముందు మీ సంగతేంటో చెప్పండి..

ABN, First Publish Date - 2023-09-03T09:51:38+05:30

ప్రధాన ప్రతిపక్షాల కూటమిని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారంటూ పదేపదే చెబుతున్న డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌(DMK president and CM Stalin)

- సీఎంకు నటి ఖుష్బూ ప్రశ్న

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రధాన ప్రతిపక్షాల కూటమిని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారంటూ పదేపదే చెబుతున్న డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌(DMK president and CM Stalin) ఆ కూటమి తరఫు ప్రధాని అభ్యర్థిని ప్రకటించేందుకు ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు, ప్రముఖ నటి ఖుష్బూ(Actress Khushboo) డిమాండ్‌ చేశారు. ఇండియా కూటమి సమావేశాలన్నీ కామెడీషోలని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఏకైక వ్యక్తిగా ఎన్నికల బరిలోకి దిగుతుంటే ఆయన్ను ఓడించేందుకు 26 పార్టీల నాయకులు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రధాన అభ్యర్థి నరేంద్రమోదీయేనని ప్రకటించగలమన్నారు. అయితే ఇండియా కూటమి తరఫున రాహుల్‌, నితీష్‏కుమార్‌, మమతా బెనర్జీని, కేజ్రీవాల్‌ని, శరద్‌పవార్‌లలో ఎవరిని ప్రకటిస్తారని ఖుష్బూ ప్రశ్నించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ ప్రధాని అభ్యర్థిని అని ధైర్యంగా ప్రకటించిన స్టాలిన్‌ ఈసారి ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. దేశంలో ప్రస్తుతం ప్రతి 10 మందిలో 8 మంది మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2023-09-03T09:51:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising