Actress Khushboo: ఆ మంత్రిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే: ఖుష్బూ
ABN, First Publish Date - 2023-07-01T10:12:13+05:30
ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులచే అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న శాఖలేని మంత్రి సెంథిల్ బాలాజిపై చట్టపరమైన చర్యలు తీసు
చెన్నై: ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులచే అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న శాఖలేని మంత్రి సెంథిల్ బాలాజిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, నటి ఖుష్బూ(Actress Khushboo) డిమాండ్ చేశారు. సెంథిల్ బాలాజి డిస్మిస్‌పై ఖుష్బూ మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్షాలకు చెందిన నేతలు ఒక కేసులో చిక్కుకుంటే వారిపై తప్పనిసరి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే డీఎంకే పార్టీ అవినీతి కేసులో అరెస్టయిన మంత్రిపై చర్యలుండకూడదని అనుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె సూచించారు.
Updated Date - 2023-07-01T10:12:14+05:30 IST