ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Money Laundering case: ప్రముఖ సినీనటిపై మనీలాండరింగ్ కేసు

ABN, First Publish Date - 2023-02-09T07:50:29+05:30

ప్రముఖ సినీనటి కృతివర్మ రూ.263 కోట్ల మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది....

Actress Kriti Verma
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి : ప్రముఖ సినీనటి కృతివర్మ రూ.263 కోట్ల మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. (Money Laundering case)సినీనటిగా మారిన మాజీ ఆదాయపు పన్నుశాఖ అధికారిణి కృతివర్మపై(Actress Kriti Verma) మనీలాండరింగ్ కేసు నమోదవడం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది.రోడీస్, బిగ్ బాస్ సీజన్ 12లో(Roadies and Bigg Boss Season 12)కనిపించిన కృతి వర్మను ఈడీ అధికారులు పలుసార్లు విచారణకు పిలిచారు.

గత ఏడాది ఐటి డిపార్ట్‌మెంట్‌లోని సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్, తానాజీ మండల్ అధికారి, పన్వేల్ భూషణ్ అనంత్ పాటిల్‌కు చెందిన వ్యాపారి, ఇతరులపై ఆదాయపు పన్ను రీఫండ్‌ల మోసం కేసు నమోదైంది. పీఎంఎల్‌ఏ నిబంధనల ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటకల్లో రూ.69.65 కోట్ల విలువైన 32 స్థిరాస్తులు, చర ఆస్తులను ఈడీ గత నెలలో అటాచ్ చేసింది.

ఇది కూడా చదవండి : United Airlines Flight: విమానంలో మంటలు...నలుగురికి అస్వస్థత

అటాచ్ చేసిన ఆస్తుల్లో భూషణ్ అనంత్ పాటిల్, రాజేష్ శెట్టి, సారిక శెట్టి, కృతి వర్మ తదితరుల పేరిట ఉన్న భూమి, ఫ్లాట్లు, లగ్జరీ కార్లు ఉన్నాయి.కృతి వర్మ హర్యానాలోని గురుగ్రామ్‌లో 2021లో సంపాదించిన ఒక ఆస్తిని విక్రయించగా ఆ డబ్బు ఆమె బ్యాంకు ఖాతాల్లోకి వచ్చింది.మోసం ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిందితుల పేరుతో లోనావాలా, ఖండాలా, కర్జాత్, పూణే, ఉడిపి ప్రాంతాల్లో భూమి, పన్వెల్, ముంబై ప్రాంతాల్లో ఫ్లాట్లు, మూడు లగ్జరీ కార్లు కొనుగోలు చేశారని ఈడీ దర్యాప్తులో తేలింది.

Updated Date - 2023-02-09T09:00:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising