ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Aditya L1 Mission: సెల్ఫీ తీసుకున్న ఆదిత్య ఎల్1.. మరో ఫొటో అయితే నిజంగా అద్భుతమే..

ABN, First Publish Date - 2023-09-07T12:46:12+05:30

భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ దిశగా దసూకెళ్తున్న ఆదిత్య ఎల్1 మిషన్ అద్భుతమైన ఫొటోలు తీసింది.

బెంగళూరు: సూర్యుడి రహ్యస్యాలు చేధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇటివల రోదసిలోకి పంపించిన ఆదిత్య ఎల్1 మిషన్ (Aditya L1 Mission) లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ దిశగా పయనిస్తోంది. అయితే అందుకు దాదాపు 4 నెలల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రయోగించిన తొలి 16 రోజులు భూకక్ష్యల్లోనే చక్కర్లు కొట్టనుంది. ప్రస్తుతం భూకక్ష్యలోనే తిరుగుతున్న ఆదిత్య ఎల్1 అద్భుతమైన ఫొటోలను తీసింది.


ఆదిత్య ఎల్1 మిషన్ ఒక అదిరిపోయే సెల్ఫీ తీసుకుంది. ఇందులో ఎల్1 మిషన్ కనిపించింది. ఇక మరో అత్యధ్బుతమైన ఖగోళ దృశ్యాన్ని ఆదిత్య ఎల్1 మిషన్ బంధించింది. ఇందులో ఒకే ఫొటోలో భూమి, చంద్రుడు కూడా ఉండడం విశేషం. సెప్టెంబర్ 4న భూమి, చంద్రుడు ఒకే కక్ష్యలో ఉన్న సమయంలో ఈ ఫొటో తీసింది. దీంతో ఒకే ఫ్రేమ్‌లో ఈ రెండూ కనిపించాయి. ఈ ఫొటో ఖగోళ ఔత్సహికులతోపాటు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘‘ ఆదిత్య-ఎల్1 మిషన్: చూస్తోంది!. సూర్యుడు-భూమి ఎల్1 పాయింట్ లక్ష్యంగా దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్1 ఒక సెల్ఫీ తీసుకుంది. భూమి, చంద్రుడి చిత్రాలు కూడా తీసింది’’ అంటూ ఇస్రో ఒక వీడియోను షేర్ చేసింది.

కాగా ఆదిత్య ఎల్1 మిషన్ శాటిలైట్‌లో మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌‌తో పాటు వెలుపల ఉండే కరోనాని అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులతో పాటు అక్కడి వాతావరణం గురించి ఇవి శోధించనున్నాయి.

Updated Date - 2023-09-07T12:59:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising