ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Palani Swami: ఎన్నికలనాటికి కొత్త కూటమితో వస్తాం : అన్నాడీఎంకే

ABN, First Publish Date - 2023-09-28T14:58:50+05:30

పార్లమెంట్ ఎన్నికల నాటికి ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తామని తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే (AIADMK)ప్రకటించింది. బీజేపీతో ఇకపై పొత్తు ఉండబోదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

తమిళనాడు: పార్లమెంట్ ఎన్నికల నాటికి ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తామని తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే (AIADMK)ప్రకటించింది. బీజేపీతో ఇకపై పొత్తు ఉండబోదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ సీనియర్ నేత కేపీ మునుసామి(Munuswami) వెల్లడించారు. బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai)ని తొలగించాలని తాము ఎన్నడూ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.


ఏఐఏడీఎంకే లాంటి పెద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరుతుందా.. అలా అడగడం తమ పార్టీకే చిన్నతనం, తాము అనాగరికులం కాదని, అలాంటి తప్పు చేయబోమని మునుసామి అన్నారు. ఎన్డీఏ(NDA) కూటమి నుంచి బయటకి వచ్చిన 3 రోజుల తరువాత అన్నాడీఎంకే మీడియాతో మాట్లాడింది. మళ్లీ ఎన్డీయేలో చేరతారన్న వదంతులపై మునుసామి స్పందిస్తూ.. సీఎం స్టాలిన్(CM Stalin) ఆయన కుమారుడు, మంత్రి ఉదయనిధి ఇదో డ్రామా అని చెబుతున్నారని.. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఎదురయ్యే భయంతోనే అలా మాట్లాడుతున్నారని అన్నారు. కె. పళనిసామి నేతృత్వంలో కొత్త కూటమిని పెడతామని మునుసామి తెలిపారు.

Updated Date - 2023-09-28T15:40:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising