ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AIADMK: ఆ మంత్రిని బర్తరఫ్‌ చేయాల్సిందే..

ABN, First Publish Date - 2023-06-22T09:09:23+05:30

రాష్ట్ర మంత్రి సెంథిల్‌బాలాజీని బర్తరఫ్‌ చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే(AIADMK) ఆధ్వర్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రోడ్డెక్కిన అన్నాడీఎంకే

- రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి సెంథిల్‌బాలాజీని బర్తరఫ్‌ చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే(AIADMK) ఆధ్వర్యంలో బుధవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరిగాయి. చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టారు. అన్నాడీఎంకే నగర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వళ్లువర్‌కోట్టం వద్ద నిర్వహించిన ధర్నాలో పార్టీ సీనియర్‌ నాయకులు సహా వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపక కార్యదర్శులు మాజీ మంత్రి మంత్రి డి.జయకుమార్‌, జిల్లా శాఖల కార్యదర్శులు విరుగై వీఎన్‌ రవి, వెంకటే్‌షబాబు, టి.నగర్‌ సత్యా, ఆర్‌ఎస్‌ రాజేష్‌, వేళచ్చేరి ఎంకే అశోక్‌ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

కంచి, చెంగల్పట్టులో...

కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరులోనూ ధర్నాలు నిర్వహించారు. కాంచీపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనకు పార్టీ జిల్లా శాఖ కార్యదర్శి వి.సోమసుందరం నాయకత్వం వహించారు. చెంగల్పట్టు పాత బస్టాండు వద్ద జరిగిన ధర్నాకు మాజీ మంత్రి పి.వలర్మతి నాయకత్వం వహించారు. తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యకళాశాల ఎదుట జరిగిన ధర్నాకు జిల్లా శాఖల కార్యదర్శులు మాధవరం మూర్తి, బీవీ రమణ, పి.బలరామన్‌, అలెగ్జాండర్‌, పి.బెంజమిన్‌ నాయకత్వం వహించారు. మాజీ ఎంపీలు వేణుగోపాల్‌, కో.హరి, మాజీ మంత్రి అబ్దుల్‌ రహీం పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈరోడ్‌, దిండుగల్‌లలో...

ఈరోడ్‌లోమాజీ మంత్రి సెంగోట్టయ్యన్‌ నాయకత్వం వహించారు. దిండుగల్‌ గడియార స్తంభం కూడలి వద్ద ధర్నాకు మాజీ మంత్రి నత్తం విశ్వనాఽథన్‌ నేతృత్వం వహించారు. ఇదే రీతిలో మదురై ఆరపాళయం క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన ఆందోళనలో మాజీ మంత్రులు సెల్లూరు రాజు, ఉదయకుమార్‌, శాసనసభ్యుడు రాజన్‌ చెల్లప్పా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-22T09:09:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising