Kerala Airport: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగివచ్చింది
ABN, First Publish Date - 2023-01-23T12:52:56+05:30
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది...
తిరువనంతపురం(కేరళ): ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.(Air India Express Flight) తిరువనంతపురం నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఆన్‌బోర్డ్ కంప్యూటర్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం కారణంగా(Due To Technical Snag) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వచ్చింది.(Returns To Kerala Airport) ఐఎక్స్ 549 నంబరు ఎయిర్ ఇండియా విమానం కేరళ రాజధాని నగరమైన తిరువనంతపురం విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 8.30 గంటలకు బయలు దేరింది. పైలట్ విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఉదయం 9.17 గంటలకు తిరిగి అదే విమానాశ్రయానికి తిరిగి వచ్చింది.
విమానంలో 105 మంది ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు.విమానయాన సంస్థ ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరో విమానం తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరుతుందని అధికారులు చెప్పారు.ప్రయాణికులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు.
Updated Date - 2023-01-23T13:05:20+05:30 IST