Airplanes: వరుస సెలవులతో పెరిగిన విమాన చార్జీలు
ABN, First Publish Date - 2023-09-28T09:55:57+05:30
నగరంలో విమాన చార్జీలు(Air fares) విపరీతంగా పెరిగాయి. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా గురువారం సెలవు ప్రకటించడం, శుక్రవారం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): నగరంలో విమాన చార్జీలు(Air fares) విపరీతంగా పెరిగాయి. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా గురువారం సెలవు ప్రకటించడం, శుక్రవారం సెలవు పెడితే వరసుగా శని, ఆది వారాంతపు సెలవులు, ఆ తర్వాత గాంధీ జయంతి కలిసి వస్తాయి. కనుక చెన్నైలో ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం బస చేస్తున్నవారంతా స్వస్థలాలకు బయలు దేరేందుకు అప్పుడే సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ వరుస సెలవు దినాల్లో దేశంలోని పర్యాటక ప్రాంతాలను విమానంలో వెళ్ళి సందర్శించేందుకు కూడా వ్యాపారులు, ఉద్యోగులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ కారణాల వల్ల విమాన సేవా సంస్థలు చార్జీలను విపరీతంగా పెంచాయి. చెన్నై నుంచి బ్యాంకాక్(Chennai to Bangkok)కు గతంలో రూ.9720 ఉన్న చార్జీ ఈనెల 28న రూ.32,581గా, ఈనెల 29న రూ.28,816గా పెంచారు. దుబాయ్‌కు రూ.10,558 ఉండేది, అయితే గురువారం రూ.21,509గాను, ఈనెల 29న 20,808గా ప్రకటించారు. ఇదే సింగపూర్ చార్జీలను రూ.9371ల నుంచి రూ.20,103లకు పెంచేశారు. కౌలాలంపూర్‌కు రూ.7620లుగా ఉన్న చార్జీని రూ.15676కు పెంచారు. కొలంబోకు ఇప్పటివరకూ రూ.6698ను వసూలు చేస్తుండగా ప్రస్తుతం రూ.11,234లుగా వసూలు చేస్తున్నారు. మైసూరుకు రూ.2558లను ఛార్జీగా వసూలు చేసేవారు. ప్రస్తుతం రూ.7437లకు పెంచారు. తూత్తుకుడికి వెళ్లేందుకు వసూలుచేస్తున్న ఛార్జీని రూ.3853 నుంచి రూ.11,173కు పెంచారు. ఇదే విధంగా పలు నగరాలకు వెళ్లే విమాన చార్జీలను కూడా విమాన సంస్థలు విపరీతంగా పెంచాయి.
Updated Date - 2023-09-28T09:55:57+05:30 IST