ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ajit Pawar: క్యాబినెట్‌లో ఎంతకాలం ఉంటానో తెలియదు.. అజిత్ సంచలన వ్యాఖ్య

ABN, First Publish Date - 2023-09-25T15:51:56+05:30

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో కానీ, ఆర్థిక మంత్రిగా కానీ తాను ఎంతకాలం కొనసాగుతానో చెప్పలేనని అన్నారు.

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit pawar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని బీజేపీ-శివసేన ప్రభుత్వంతో తమ పార్టీ పొత్తుపై సందేహాలకు తావిచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. షిండే మంత్రివర్గంలో కానీ, ఆర్థిక మంత్రిగా కానీ ఎంతకాలం ఉంటానే తాను చెప్పలేనంటూ అజిత్ తాజాగా బాంబు పేల్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారంనాడు పాల్గొన్న ఓ కార్యక్రమానికి ఆయన గైర్హాజర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అదేరోజు జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రివర్గంలో కానీ, ఆర్థిక మంత్రిగా కానీ తాను ఎంతకాలం కొనసాగుతానో చెప్పలేనన్నారు.


''మన సంస్థలు బలంగా ఉండాలి. ఈరోజు నేను మంత్రివర్గంలో ఉన్నాను. రేపు ఉంటానో ఉండనో నాకు తెలియదు. ఆర్థిక శాఖ నా చేతిలో ఉంది. రేపు ఉంటుందో లేదో చెప్పలేను. రేపు ఎలాగ ఉంటుందో ఎవరు చూసొచ్చారు? అయితే మన విభిన్న వ్యవస్థలు మాత్రం బలంగా ఉండాలి'' అని బారామతి మార్కెట్ కమిటీ వార్షిక సమావేశంలో ఆయన అన్నారు. బాంద్రాలోని వినాయక మండపాన్ని అమిత్‌షా సందర్శించినప్పుడు సీఎం ఏక్‌నాథ్ షిండే, మరో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరుకాగా, అజిత్ పవార్ మాత్రం దూరంగా ఉండిపోయారు. అయితే, దీనిపై వచ్చిన ఊహాగానాలను అజిత్ తోసిపుచ్చారు. తన ముందస్తు కార్యక్రమాల గురించి అమిత్‌షా కార్యాలయానికి తెలియజేశానని చెప్పారు.


ముస్లిం కోటాపై అలక..?

కాగా, విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ కోటా కల్పించాలని అజిత్ అభిప్రాయంగా ఉంది. దీనిపై చర్చించాలని అజిత్ పవార్ పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయమై షిండే, ఫడ్నవిస్‌తో తాను చర్చిస్తాననని ఆయన తెలిపారు. అయితే, ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్ ఆలోచనతో శివసేన, బీజేపీ విభేదిస్తున్నాయి. దీనిపై అజిత్ మాట్లాడుతూ, మరాఠా రిజర్వేషన్ తరహాలో మైనారిటీలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించే ప్రొవిజన్‌కు ఎలాంటి చట్టపరమైన చిక్కులు ఉండవని అజిత్ చెప్పారు. దీనిపై షిండే, ఫడ్నవిస్‌తో చర్చించిన తర్వాతే తాను ఒక నిర్ణయానికి వస్తానని తెలిపారు.

Updated Date - 2023-09-25T15:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising