Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్‌కు అకల్ తఖ్త్ జతేదార్ వీడియో మెసేజ్
ABN, First Publish Date - 2023-03-26T18:46:21+05:30
ఖలిస్థాన్ (Khalistan) సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)కు అకల్ తఖ్త్ జతేదార్ జ్ఞానీ హర్‌ప్రీత్
న్యూఢిల్లీ : ఖలిస్థాన్ (Khalistan) సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)కు అకల్ తఖ్త్ జతేదార్ జ్ఞానీ హర్‌ప్రీత్ (Giani Harpreet) ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పోలీసులకు లొంగిపోయి, దర్యాప్తునకు సహకరించాలని హితవు పలికారు. మరోవైపు పోలీసుల సమర్థతను కూడా ఆయన ప్రశ్నించారు. అమృత్‌పాల్‌ను ఎందుకు పట్టుకోలేకపోతున్నారని నిలదీశారు. ఈ వీడియో సందేశాన్ని ఆయన శనివారం విడుదల చేశారు.
పంజాబ్‌లో భారీ పోలీసు దళం ఉన్నప్పటికీ అమృత్‌పాల్‌ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారనే అంశం ప్రపంచంలోని ప్రతి సిక్కు మదిని తొలుస్తున్న అతి పెద్ద ప్రశ్న అని చెప్పారు. ఆయనను ఇప్పటికే అరెస్ట్ చేసి ఉంటే, ఆ విషయాన్ని పోలీసులు బయటపెట్టాలన్నారు. పంజాబ్‌లో పరిస్థితిపై చర్చించేందుకు రాష్ట్రంలోని దాదాపు 70 సిక్కు సంస్థలు, సెమినరీలు, నిహంగ్ సంస్థలను కోరారు. ఈ సమావేశానికి రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించలేదు.
పాటియాలాలో మహిళ అరెస్ట్
అమృత్‌పాల్‌కు, ఆయన సహచరుడికి ఆశ్రయమిచ్చిన ఓ మహిళను పాటియాలాలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ మహిళ ఇంట్లో దాదాపు ఆరు గంటలపాటు వీరు ఉన్నారని, ఆ తర్వాత హర్యానాలోని కురుక్షేత్రకు వెళ్లారని చెప్పారు. కురుక్షేత్రలో మరో మహిళను అంతకుముందు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు మార్చి 18 నుంచి గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Hyper loop: చెన్నై-బెంగళూరు మధ్య హైపర్ లూప్?
Updated Date - 2023-03-26T18:46:21+05:30 IST