ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Future PM: విపక్షాల ప్రధాని అభ్యర్థి జాబితాలో అఖిలేష్..?

ABN, First Publish Date - 2023-07-02T15:44:37+05:30

విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాజాగా వచ్చి చేరారు. ఆయనను భవిష్యత్ ప్రధానిగా పేర్కొంటూ పలు పోస్టర్లు లక్నోలో వెలిసాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ (SP) అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) తాజాగా వచ్చి చేరారు. ఆయనను భవిష్యత్ ప్రధానిగా (Future PM) పేర్కొంటూ పలు పోస్టర్లు లక్నోలో వెలిసాయి. అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా శనివారంనాడు పార్టీ కార్యకర్తలు లక్నో కార్యాలయం వెలుపల అఖిలేష్‌ను ''భావి ప్రధాని''గా పేర్కొంటూ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్య కూటమికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో పీఎం ఆశావహుల జాబితాలో అఖిలేష్ యాదవ్ పేరు తెరపైకి రావడం విశేషం.

ఎస్‌పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ భారీ పోస్టర్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పోస్టర్లను ఆ పార్టీ ప్రతినిధి ఫకృల్ హసన్ చాంద్ ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, యూపీలో జరిగే 2024 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని, లోక్‌సభలో భారీ ప్రాతినిధ్యం ఉన్న ఉత్తరప్రదేశ్‌కు అత్యంత రాజకీయ ప్రాధాన్యత ఉందని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు అఖిలేష్ యాదవ్‌పై అచంచలమైన నమ్మకం ఉందని, సమాజ్‌వాదీ పార్టీ ఘనవిజయానికి అంకింతభావంతో పనిచేయనున్నారని తెలిపారు. యూపీలో ఎస్‌పీ గణనీయమైన సీట్లు గెలుచుకుంటుందని, అంతిమంగా అఖిలేష్ యాదవ్ ప్రధానమంత్రి కావడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. అఖిలేష్ పుట్టినరోజు సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ హెచ్చు సంఖ్యలో లోక్‌సభ సీట్లు గెలుచుకుని ఆయన ప్రధాని కావాలని తామంతా కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలకు మద్దతుగా నిలుస్తున్న అఖిలేష్ యాదవ్ మాత్రం ఇంతవరకూ తాను ప్రధాని అభ్యర్థిగా ఉండాలన్న కోరికను బహిరంగంగా వ్యక్తం చేయలేదు.

కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలని ఆశిస్తుండగా, మమతా బెనర్జీ పీఎం అవుతారని టీఎంసీ చెబుతోంది. కేజ్రీవాల్‌ను పీఎంగా చూడాలని 'ఆప్' కోరకగా ఉంది. దీనికి ముందు బీహార్ సీఎం నితీష్ కుమార్‌ భావి సీఎం అంటూ ప్రచారం జరిగింది. అయితే, ఈ నేతలెవరూ పీఎం రేసులో ఉన్నట్టు ఇంతవరకూ ప్రకటించలేరు. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీతో తలబడే విపక్షాల ఉమ్మడి నేత (పీఎం అభ్యర్థి) ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2023-07-02T15:44:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising