ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Akhilesh Yadav: కాంగ్రెస్ ఎలా ప్రవర్తిస్తే అలాగే రియాక్ట్ అవుతాం.. సీట్ల పంపకాలపై మండిపడ్డ అఖిలేశ్ యాదవ్

ABN, First Publish Date - 2023-10-19T20:28:06+05:30

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమిలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయా? అంటే.. తాజా పరిణామాలు అందుకు అవుననే సమాధానాలు చెప్తున్నాయి.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమిలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయా? అంటే.. తాజా పరిణామాలు అందుకు అవుననే సమాధానాలు చెప్తున్నాయి. ఈ కూటమిలో భాగమైన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. కాంగ్రెస్ ఎలా ప్రవర్తిస్తే తామూ అలాగే వ్యవహరిస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేదని కాంగ్రెస్ చెప్పడం వల్లే ఆయన ఇలా మండిపడ్డారు.

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పొత్తు లేదన్న విషయంపై అఖిలేష్ మాట్లాడుతూ.. ఈ పొత్తు (ఇండియా కూటమి) కేవలం జాతీయ స్థాయిలోనే ఉందని, రాష్ట్ర స్థాయిలో కాదన్న సమాచారం తమకు ఇంతకుముందు తెలియదని అన్నారు. ఒకవేళ రాష్ట్ర స్థాయిలో ఈ ‘ఇండియా’ పొత్తు ఉండదని తమకు తొలిరోజే తెలిసి ఉంటే.. తమ పార్టీ కార్యకర్తలు ఎప్పటికీ కలిసేవాళ్లు కాదని, అలాగే కాంగ్రెస్ వాళ్లకు లిస్ట్ ఇచ్చేవాళ్లం కాదని చెప్పారు. కేవలం ఉత్తరప్రదేశ్ కేంద్రానికి మాత్రమే ఈ పొత్తు పెట్టుకుంటే మాత్రం విచారం వ్యక్తం చేయక తప్పదని కుండబద్దలు కొట్టారు. అంటే.. ఇండియా కూటమిలో ఉండాలా? వద్దా? అనేది తాము పునరాలోచిస్తామన్నట్టుగా ఆయన సంకేతాలు ఇచ్చారు.


అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ స్థాయిలో పొత్తు లేదని మాకు తెలిస్తే, మేము సమావేశాలకు వెళ్లేవాళ్లం కాదు, కాంగ్రెస్ నేతల ఫోన్లనూ ఎత్తేవాళ్లం కాదు. మధ్యప్రదేశ్‌లో మా ఎస్పీ నేతలు ఎవరెవరు? ఎక్కడెక్కడ? గెలిచారన్న పూర్తి వివరాలు కాంగ్రెస్‌కు తెలియజేశాం. మేము రెండో స్థానంలో ఉన్నామని కూడా స్పష్టం చేశాం. కానీ.. జాబితా వచ్చినప్పుడు చూస్తే, వాళ్లు ప్రతీదీ ప్రకటించేసినట్టు మాకు తెలిసింది. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి (కమల్ నాథ్), అంతకుముందు ముఖ్యమంత్రి (దిగ్విజయ్) సమావేశం కోసం మమ్మల్ని పిలిచారు. ఆ సమావేశంలో మా పార్టీ పనితీరుతో పాటు నేతల గురించి పూర్తి సమాచారం అందించాం’’ అని అన్నారు.

కాంగ్రెస్ నేతలు తమ పార్టీ నేతలను రాత్రి ఒంటి గంట వరకూ కూర్చోబెట్టి మాట్లాడారని అఖిలేష్ చెప్పారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీ కోసం ఆరు సీట్లను కేటాయిస్తామని వాళ్లు భరోసా కల్పించారన్నారు. కానీ.. జాబితా వచ్చిన తర్వాత చూస్తే, అందులో ఒక్క ఎస్పీ అభ్యర్థికి కూడా చోటు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తు లేదని కాంగ్రెస్ చెప్పిందని, దాన్ని తాము స్వీకరిస్తామని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే.. ఆ విషయంపై తాము ఆలోచిస్తామని అఖిలేష్ స్పష్టం చేశారు. చూస్తుంటే.. కాంగ్రెస్, ఎస్పీ పార్టీల మధ్య రగిలిన ఈ చిచ్చు ఇండియా కూటమికి పెద్ద తలనొప్పిగా మారేలా ఉంది.

Updated Date - 2023-10-19T20:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising