ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Akhilesh Yadav: ఇది ఇండియా కూటమి విజయం.. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుంది

ABN, First Publish Date - 2023-09-08T21:41:11+05:30

ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్ ఘనవిజయం సాధించారు. తన బీజేపీ ప్రత్యర్థి దారా సింగ్ చౌహాన్‌పై ఏకంగా 42,759 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో...

ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్ ఘనవిజయం సాధించారు. తన బీజేపీ ప్రత్యర్థి దారా సింగ్ చౌహాన్‌పై ఏకంగా 42,759 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సమాద్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గెలుపొందిన తన పార్టీ అధ్యర్థి సుధాకర్ సింగ్‌కి, ఘోసీ ప్రజలను అభినందించారు. అంతేకాదు.. ఇది ఇండియా కూటమి విజయమని, తదుపరి లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుందని పేర్కొన్నారు.

ఘోసీ ప్రజలు కేవలం తమ పార్టీ అభ్యర్థిని గెలిపించడమే కాదు.. ఇండియా కూటమికి కూడా సహాయం చేశారని, సరికొత్త ఉత్సాహాన్ని అందించారని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరంతరం తగ్గుతున్న ఆదాయంతో ఇక్కట్లు పడుతున్న కుటుంబాల ఆగ్రహావేశం ఇది అని.. ఓట్ల రూపంలో బీజేపీని ఓడించి, వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని అఖిలేశ్ యాదవ్ ట్విటర్ మాధ్యమంగా పేర్కొన్నారు. ఇది బీజేపీకి రాజకీయంగానే కాదు.. నైతిక పరాజయం కూడా అని కౌంటర్లు వేశారు. ఘోసీ ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఇండియా కూటమి తన ఖాతా తెరిచిందని ట్వీట్ చేశారు.


కాగా.. ఈ ఉప ఎన్నికల్లో సుధాకర్ సింగ్‌కి మొత్తం 1,24,427 ఓట్లు నమోదవ్వగా, బీజేపీ అభ్యర్థి దారా సింగ్ చౌహాన్‌కు 81,668 ఓట్లు వచ్చాయి. దీంతో.. 42,759 ఓట్ల తేడాతో సుధాకర్ సింగ్ గెలిచారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఘోసీ సీటుని దారా సింగ్ గెలుపొందారు. అయితే.. ఆయన జులై సమాజ్‌వాదీ పార్టీని వీడి బీజేపీలోకి చేరారు. ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో.. ఈ ఉప ఎన్నికలు అనివార్యమైంది. కానీ.. బీజేపీ తరఫున పోటీ చేసిన దారాసింగ్ ఓటమి పాలయ్యారు.

ఇదిలావుండగా.. మొత్తం 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేపై పోరాటానికి కొత్తగా విపక్షాల ఇండియా కూటమి ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడంతో.. ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. సెప్టెంబర్ 5న ఉప ఎన్నికలు జరగ్గా.. ఫలితాలు శుక్రవారం వచ్చాయి. ఎన్డీయే కూటమి 3 స్థానాల్లో గెలుపొందగా.. 'ఇండియా' కూటమి 4 స్థానాలు కైవసం చేసుకుంది. కూటమి పక్షాలైన కాంగ్రెస్, జేఎంఎం, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ చెరో సీటు చొప్పున గెలుచుకున్నాయి.

Updated Date - 2023-09-08T21:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising