Allpass: విద్యాశాఖ కీలక ప్రకటన.. ‘1 నుంచి 8’ ఆల్‌పాస్
ABN, First Publish Date - 2023-04-22T07:31:48+05:30
ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరినీ ఉత్తీర్ణులైనట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(Puducherry)లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరినీ ఉత్తీర్ణులైనట్లు ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ విషయమై పుదుచ్చేరి, కారైక్కాల్ రీజియన్‌లలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ ఒక సర్క్యులర్‌ను పంపింది. 2021-22 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించినట్టు పేర్కొంది. ఎనిమిదో తరగతి విద్యార్థులు, మూడు నెలలు, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షల్లో పొందిన మార్కులను మార్కుల జాబితాలో పొందుపరచాలని పేర్కొంది. తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 35 శాతం మార్కులు పొందినట్టయితే ఉత్తీర్ణులైనట్టుగా ప్రకటించాలనింది. అదేవిధంగా 1వ తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థుల ఫలితాలను మే 8వ తేదీలోగా తెలియజేయాలని పేర్కొంది.
ఇదికూడా చదవండి: మరో ఆసక్తికర పోటీ.. తలపడుతున్న గురుశిష్యులు
Updated Date - 2023-04-22T07:31:48+05:30 IST