ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Siddaramaiah vs DK Shivakumar: డీకే శివకుమార్‌ సీఎం పదవిని వదులుకుంటానంటే భారీ ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం...

ABN, First Publish Date - 2023-05-16T15:23:15+05:30

పార్టీ సీనియర్ సిద్ధారామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి కోసం పట్టుబడుతున్నారు. వెనక్కితగ్గే ఉద్దేశ్యంలేదని ఇద్దరూ చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన శనివారం నుంచి ఇదే పంచాయితీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం అభ్యర్థిత్వంపై తేల్చిపడేయాలని భావించిన అధిష్ఠానం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం పీఠంపై (Karnataka CM tussle) ఎడతెగని సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ సీనియర్ సిద్ధారామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి కోసం పట్టుబడుతున్నారు. వెనక్కితగ్గే ఉద్దేశ్యంలేదని ఇద్దరూ చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన శనివారం నుంచి ఇదే పంచాయితీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం అభ్యర్థిత్వంపై తేల్చిపడేయాలని భావించిన అధిష్టానం కసరత్తును ముమ్మరం చేసింది. సాధ్యమైన పరిష్కారాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో రాహుల్ గాంధీ మంగళవారం చర్చించారు. ఈ భేటీలో రెండు ఫార్ములాలపై సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది.

మొదటి ఫార్ములాలో.. సిద్ధరామయ్యకు సీఎం పదవి కట్టబెట్టి, డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎంతోపాటు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగే అవకాశాన్ని ఇవ్వనున్నారట. ఈ ఫార్ములాలో 2 ముఖ్యమైన శాఖలతోపాటు తాను ఎంచుకున్న ముగ్గురు వ్యక్తులను మంత్రులుగా కూడా డీకే శివకుమార్ ఎంపిక చేసుకోవచ్చు.

ఇక రెండవ ఫార్ములాలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవిని చెరిసగం కాలం పంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఇద్దరూ రెండున్నర సంవత్సరాలపాటు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఎవరు ముందు పదవిని చేపడతారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కాగా ఈ ఫార్ములాల విషయంలో పరిశీలకుల రిపోర్ట్ ఆధారంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ లీడర్ బీకే హరిప్రసాద్ వెల్లడించారు.

సీఎం రేసులో సిద్ధరామయ్య ముందున్నారని, డీకే శివకుమార్ దీనిని వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జరగడంపై డీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ అంతా కలిసి ఈ పార్టీని నిర్మించుకున్నాం. మేమంతా ఉమ్మడిగా ఈ ఇంటిని కట్టుకున్నాం. నేనూ ఇందులో భాగమే.. అమ్మ తన బిడ్డకు అన్ని ఇస్తుంది కదా’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-05-16T16:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising