ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Assembly Elections: కాంగ్రెస్‌‌పై అమిత్ షా సెటైర్లు

ABN, First Publish Date - 2023-04-28T21:26:56+05:30

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కాంగ్రెస్ పార్టీపై (Congress Party) సెటైర్లు వేశారు.

Amit Shah comments in Karnataka Assembly Elections
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కాంగ్రెస్ పార్టీపై (Congress Party) సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లికార్జున ఖర్గే (Kharge), డీకే శివకుమార్ (DK Shivakumar), సిద్ధరామయ్య (Siddaramaiah) ముఖ్యమంత్రి పదవి కోసం తగవులాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఆ ఛాన్స్ దక్కబోదని, బీజేపీ నుంచే సీఎం వస్తారని ఆయన జోస్యం చెప్పారు. హరిహరా, దావణగెరె తదితర ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కులతత్వం, కుటుంబ, తుష్టీకరణ రాజకీయాలు చేస్తుందని షా ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లో 60 ఏళ్లపాటు 370 ఆర్టికల్‌ను రద్దు చేయకుండా కాంగ్రెస్ చోద్యం చూసిందని చెప్పారు. పీఎఫ్‌ఐ‌పై కాంగ్రెస్ ఏ చర్యలు తీసుకోకపోతే బీజేపీ బ్యాన్ చేసిందని షా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను ఏటీఎంగా వాడుకోవాలని చూస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత కీర్తిని రెపరెపలాడిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందన్నారు.

మరోవైపు యెడ్యూరప్ప‌ (BS Yediyurappa) తనయుడు విజయేంద్రకు(Vijayendra) మద్దతుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( BJP chief JP Nadda) శివమొగ్గలో ప్రచారం చేశారు. దేశంలో 1947 నుంచి 2014లోపు 74 ఎయిర్‌పోర్టులుంటే మోదీ అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాలలోనే 74 ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించామని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29న కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 6 రోజుల్లో 22 ర్యాలీల్లో ఆయన పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

కర్ణాటకలో మే 8తో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. మే పదిన ఎన్నికలు జరుగుతాయి. మే 13న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-04-28T21:27:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising