ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eknadh Shinde: నా వెనకాల అమిత్‌షా ఉన్నారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-19T12:28:21+05:30

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తనకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారని, తన వెంటే బలంగా నిలబడ్డారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Sha) తనకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారని, తన వెంటే బలంగా నిలబడ్డారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) అన్నారు. ఏక్‌నాథ్ షిండే వర్గానికి శివసేన పేరు, పార్టీ గుర్తు 'విల్లు-బాణం' చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేపథ్యంలో షిండే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. షిండే ఆదివారంనాడిక్కడ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ... మీరు ముందుకు వెళ్లండి, మీ వెనుకాల మేము నిలబడతామని అమిత్‌షా తనతో చెప్పారని, ఆయన చెప్పిందే చేశారని, తన మాట నిలుపుకొన్నారని చెప్పారు.

ఎన్నికల కమిషన్ తీర్పుపై అమిత్‌షా సైతం ఒక ట్వీట్‌లో స్పందించారు. సత్యానికి, అబద్ధానికి ఉన్న తేడా ఈసీ నిర్ణయంతో నిరూపితమైందని అన్నారు. సత్యమేయ జయతే ఫార్ములా మరోసారి ఈసీ నిర్ణయంతో రుజువైందని అన్నారు.

గత ఏడాది జూన్‌లో ఏక్‌నాథ్ షిండే వర్గం అప్పటి మహా వికాశ్ అఘాడి ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేలలో 40 మందిని, 18 మంది ఎంపీల్లో 13 మందిని షిండే తన వైపు తిప్పుకున్నారు. దీంతో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలింది. ఆ వెంటనే బీజేపీతో షిండే పొత్తుపెట్టుకుని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పార్టీ గుర్తు, పేరు తమకే చెందాలంటూ ఉద్ధవ్, షిండే వర్గం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. దాదాపు ఎనిమిది నెలల హైడ్రామాకు కేంద్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం తెరదించింది. షిండేకు 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎక్కువ మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఇది పార్టీ సాధించిన ఓట్లలో 76 శాతమని తెలిపింది. 23.5 శాతం మందే ఉద్ధవ్ వైపు ఉన్నట్టు 78 పేజల ఆదేశాల్లో ఈసీ స్పష్టం చేసింది. కాగా, ఉద్ధవ్ ధాకరేపై తిరిగుబాటు సమయంలో శివసేన పొత్తు ధర్మం నిలుపుకోలేదని, అందులో తాము వేరుపడ్డామని ఇంతవరకూ చెప్పుకుంటూ వచ్చిన ఏక్‌నాథ్ షిండే, ఈసీ నిర్ణయం వెలువడి పార్టీ గుర్తు, పేరు తమ చేతికి వచ్చాక అమిత్‌షా తమ వెనకాల ఉన్నారంటూ వ్యాఖ్యానించాన్ని ఉద్ధవ్ వర్గంతో పాటు విపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి.

Updated Date - 2023-02-19T12:28:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising