ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi Services Bill: రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్‌షా

ABN, First Publish Date - 2023-08-06T17:48:37+05:30

గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2023ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈనెల 7వ తేదీ సోమవారంనాడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు బదిలీ చేసే ఆర్డినెన్స్ స్థానే కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన బిల్లును విపక్ష ఎంపీల ఆందోళన మధ్య లోక్‌సభ ఆమోదించింది.

న్యూఢిల్లీ: గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2023ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఈనెల 7వ తేదీ సోమవారంనాడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు బదిలీ చేసే ఆర్డినెన్స్ స్థానే కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన బిల్లును విపక్ష ఎంపీల ఆందోళన మధ్య లోక్‌సభ ఆమోదించింది. ఢిల్లీకి సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని, దీనిపై ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా అవి రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవేనని అమిత్‌షా లోక్‌సభలో బిల్లు ప్రవేశపెడుతూ వ్యాఖ్యానించారు. ఈ బిల్లును జూలై 25న కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది.


కాగా, ఈ బిల్లును అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజ్యసభకు బిల్లు వచ్చే సమయంలో దీనిని వ్యతిరేకించాలంటూ గత రెండు నెలలుగా కేజ్రీవాల్ విపక్ష నేతలను కలుసుకుని మద్దతు సమీకరిస్తున్నారు. ఈ ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టులోనూ ఆప్ ప్రభుత్వం సవాలు చేసింది. కాగా, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగానే కాంగ్రెస్ సీనియర్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి విపక్షాల తరఫున చర్చ ప్రారంభించే అవకాశం ఉంది. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వానికి సింఘ్వి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన రోజే చర్చ ప్రారంభించి, సాయంత్రం ఓటింగ్ నిర్వహించాలని కేంద్రం ఆలోచనగా ఉంది.

Updated Date - 2023-08-06T17:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising