Amma canteens: రూ.9 వేల నుంచి రూ.6 వేలకు.., ఎలా బతకాలో చెప్పండి..
ABN, First Publish Date - 2023-04-19T08:04:13+05:30
క్యాంటీన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం తగ్గించడంతో మేము ఎలా బతకాలంటూ అందులో పనిచేస్తున్న
ప్యారీస్(చెన్నై): గ్రేటర్ చెన్నైకార్పొరేషన్ (జీసీసీ) పరిధిలో వున్న అమ్మా క్యాంటీన్ల(Amma canteens)లో పని చేస్తున్న ఉద్యోగుల వేతనం రూ.9 వేల నుంచి రూ.6 వేలకు తగ్గించారు. దీనిపై జీసీసీకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ... అమ్మా క్యాంటీన్ల నిర్వహణ వల్ల రూ.1,200 కోట్ల నష్టం వాటిల్లిందని, అందువల్లే ఉద్యోగుల వేతనం తగ్గించడంతో పాటు వారి సంఖ్యను కూడా కుదిస్తున్నామని పేర్కొన్నారు. గత 2013లో నాటి ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha) పేదలకు నాణ్యమైన ఆహారం సరసమైన ధరలకు అందించాలన్న ఉద్దేశంతో అమ్మా క్యాంటీన్ల పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ మేరకు నగరంలో 402 క్యాంటీన్లు పని చేస్తున్నాయి. ఈ క్యాంటీన్ల ద్వారా సంవత్సరానికి రూ.20 కోట్లు రాగా, నిర్వహణ కోసం రూ.140 కోట్లు వ్యయం అవుతోంది. ఆ మేరకు గత పదేళ్లలో జీసీసీ(GCC)కి 1,200 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని సరి చేసే విధంగా కార్పొరేషన్ యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ అన్నా క్యాంటీన్లలో 10-12 మంది సిబ్బంది పని చేస్తుండగా, ఆ సంఖ్యను 8కి కుదించారు.
ఇదికూడా చదవండి: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. ‘పదవి నుంచి తప్పుకుంటా’నంటూ..
Updated Date - 2023-04-19T08:04:13+05:30 IST