Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్ కొత్త ఎత్తుగడ
ABN, First Publish Date - 2023-03-24T14:22:49+05:30
పంజాబ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్
న్యూఢిల్లీ : పంజాబ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) భారత దేశ చట్టాల నుంచి తప్పించుకోవడం కోసం కొత్త ఎత్తుగడ వేసినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. బ్రిటన్ పౌరసత్వం కోసం ఫిబ్రవరిలో దరఖాస్తు చేసినట్లు చెప్తున్నాయి.
బ్రిటిష్ పౌరురాలు కిరణ్ కౌర్ (Kiran Kaur)ను అమృత్‌పాల్ పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం ఆధారంగా తనకు బ్రిటిష్ పౌరసత్వం ఇవ్వాలని ఫిబ్రవరిలో ఆయన దరఖాస్తు చేసినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ దరఖాస్తుపై బ్రిటన్ అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.
స్థానిక అధికారులు, పౌర సమాజం ద్వారా తనపై పెరుగుతున్న ఒత్తిడిని అమృత్‌పాల్ గ్రహించినట్లు తెలుస్తోంది. సిక్కు మతస్థులు ఆయనను నమ్మకపోవడంతో సురక్షితంగా బ్రిటన్‌కు పారిపోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీప్ సిద్ధూ ప్రారంభించిన వారిస్ పంజాబ్ డే సంస్థకు అమృత్‌పాల్ ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నారు. దీప్ సిద్ధూ గత ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించారు.
అమృత్‌పాల్ అనుచరుడిని అరెస్ట్ చేయడంతో, అమృత్‌పాల్ అనుచరులు అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
CAG Report : ఏపీ ప్రభుత్వ అప్పులు ఎన్ని లక్షల కోట్లో తెలిస్తే..
Minister: మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మద్యం సేవించే వారిసంఖ్య అంటూ..
Updated Date - 2023-03-24T14:22:49+05:30 IST