ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఖలిస్థానీ నేత అవతార్ సింగ్ మృతి..

ABN, First Publish Date - 2023-06-15T11:40:45+05:30

ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అతని హ్యాండ్లర్, బ్రిటన్‌లోని ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ (KLF) చీఫ్ అవతార్ సింగ్ ఖండా మరణించారు. ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆయన వైద్య నివేదికల ప్రకారం ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అతని హ్యాండ్లర్, బ్రిటన్‌లోని ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ (KLF) చీఫ్ అవతార్ సింగ్ ఖండా మరణించారు. ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆయన వైద్య నివేదికల ప్రకారం ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం.

అవతార్ సింగ్ అండదండలతోనే అమృత్‌పాల్ సింగ్ ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య కాలంలో 37 రోజులపాటు పోలీసుల కళ్లుగప్పి తిరగడం సాధ్యమైందని తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, అవతార్ సింగ్‌పై విష ప్రయోగం జరిగినట్లు, ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్య నివేదికలు చెప్తున్నాయని సమాచారం. ఆయన బాంబుల తయారీలో నిపుణుడని, మార్చి 19న జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా లండన్‌లోని హై కమిషన్ కార్యాలయం భవనంపైగల భారత దేశ జాతీయ పతాకాన్ని తొలగించడం వెనుక ఆయన పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈ సంఘటనలో కీలక నిందితుల్లో అవతార్ సింగ్‌తోపాటు మరో ముగ్గురు వేర్పాటువాదులు ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గుర్తించింది.

అవతార్ సింగ్ కేఎల్ఎఫ్ ఉగ్రవాది కుల్వంత్ సింగ్ కుమారుడు. ఆయన స్టూడెంట్ వీసాపై 2007లో బ్రిటన్‌కు వెళ్లారు. 2012లో బ్రిటన్ ఆశ్రయం పొందారు. ఆయన రణ్‌జోధ్ సింగ్ అనే మారుపేరుతో కేఎల్ఎఫ్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది. కేఎల్ఎఫ్ చీఫ్ హర్మీత్ సింగ్‌ను 2020 జనవరిలో పాకిస్థాన్‌లో హత్య చేశారు. ఆ తర్వాత అవతార్ సింగ్ ఈ సంస్థకు నాయకత్వం వహించారు.

వారిస్ పంజాబ్ డే సంస్థకు చీఫ్‌గా దీప్ సిద్ధూ వ్యవహరించేవాడు. ఆయన మరణించిన తర్వాత అమృత్‌పాల్ సింగ్‌ను ఈ సంస్థకు చీఫ్‌గా చేయడంలో అవతార్ సింగ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. 37 రోజులపాటు పరారీలో ఉన్న అమృత్‌పాల్ ఏప్రిల్ 23న పంజాబ్‌లోని మోగాలో పోలీసులకు లొంగిపోయాడు. ఆయనను అస్సాంలోని డిబ్రూగఢ్ జైలులో ఉంచారు. అక్కడ ఆయన సహచరులు ఎనిమిది మంది కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి :

Kolkata Airport : కోల్‌కతా విమానాశ్రయంలో స్వల్ప అగ్ని ప్రమాదం

Cyclone Biparjoy : బిపర్‌జోయ్ తుపాను ప్రభావం.. ద్వారకలోని శ్రీ భడకేశ్వర్ మహాదేవ్ దేవాలయం వద్ద సముద్రం అల్లకల్లోలం..

Updated Date - 2023-06-15T11:40:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising