ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Earthquake: తెల్లవారుజామున భూకంపం.. భయాందోళనలో ప్రజలు

ABN, First Publish Date - 2023-10-01T10:45:44+05:30

అస్సాంలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున 3:01 గంటల సమయంలో ధుబ్రి జిల్లాలో భూకంపం వచ్చింది.

అస్సాంలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున 3:01 గంటల సమయంలో ధుబ్రి జిల్లాలో భూకంపం వచ్చింది. భూమిలో 17 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభంవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.1గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. గత సోమవారం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో కూడా భూకంపం సంభవించింది. భూమిలో 5 కిలో మీటర్ల లోతులో భూకంపం వచ్చింది. ఉదయం 8 గంటల 35 నిమిషాల సమయంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైంది. సెప్టెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, చంబా జిల్లాల్లో కూడా స్వల్ప భూకంపాలు సంభవించాయి. వాటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.8, 2.1గా నమోదయింది.

Updated Date - 2023-10-01T10:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising