Shamshabad Airport: హైదరాబాద్ విమానాశ్రయంలో స్మార్ట్ ట్రాలీ.. ప్రెట్టీ కూల్ అంటూ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా
ABN, Publish Date - Dec 16 , 2023 | 12:15 PM
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్(Rajivgandhi International Airport)లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలు(Smart Trolley)అందుబాటులోకి వచ్చాయి.
హైదరాబాద్: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్(Rajivgandhi International Airport)లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలు(Smart Trolley)అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు ఈ తరహా టెక్నాలజీని కల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ డిజిటలీకరణలో ఇది ముందడుగు అని చెప్పుకోవచ్చు. స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీ సదుపాయాన్ని మొదటి సారి మ్యూనిక్ ఎయిర్ పోర్ట్ లో తీసుకొచ్చారు.
ఆ తరువాత రెండో ఎయిర్ పోర్ట్ హైదరాబాద్ లోనే ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్ట్ బ్యాగేజీ ట్రాలీల కోసం లాంగ్ రేంజ్ ప్లాట్ ఫాంను జీఎంఆర్ ఏర్పాటు చేసింది. ఈ సాంకేతికత ద్వారా సుమారు 3 వేల బ్యాగేజీ ట్రాలీలు అనుసంధానించిన క్రమంలో ప్రయాణికలు వేచి చూసే సమయం గణనీయంగా తగ్గుతుంది.
ఐఏటీఏ(IATI) నిబంధనల ప్రకారం.. 10 లక్షల మంది ప్రయాణికులకు కనీసం 160 ట్రాలీలు ఉండాలి. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనే 3 వేల ట్రాలీలు ఉన్నాయి. సాధారణంగా ఎయిర్ పోర్ట్ కి వచ్చే ప్రయాణికులకు ట్రాలీలు ఏర్పాటు చేయడానికి సిబ్బంది ఎంతో శ్రమిస్తుంటారు. ఐవోటీ ఆధారిత స్మార్ట్ ట్రాలీ మేనేజ్ మెంట్ ద్వారా అధిగమించే వీలుంటుంది.
విశేషాలివే..
ఈ ట్రాలీ వ్యవస్థ మొబైల్, లాప్ టాప్, కంప్యూటర్ పై పని చేస్తుంది. నో జోన్ లోకి ట్రాలీ వెళ్లగానే వెంటనే అలర్ట్ చేస్తుంది. ఫ్లైట్ ఆలస్యంపై ముందే సమాచారం అందిస్తుంది. దానిపై ఉన్న డ్యాష్ బోర్డుపై వివరాలు కనిపిస్తుంటాయి. బోర్డింగ్ లో పాస్ వివరాలు ఎంటర్ చేస్తే చాలు.. ఫ్లైట్ టైమింగ్స్‌తో పాటు గేట్ నంబర్ వివరాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి.
బోర్డింగ్ కు టైం ఉంటే షాపింగ్ చేసుకునేందుకు వీలుగా అన్ని వివరాలు డ్యాష్ బోర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనిపై షాపులు, దాని వివరాలు, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకోవచ్చు. వాటితోపాటు వాష్ రూంలు, రెస్టారెంట్లు, ఫుడ్ వివరాల గురించి వివరాలు కనిపిస్తాయి.
ప్రెట్టీ కూల్ అంటూ ఆనంద్ మహీంద్రా..
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో స్మార్ట్ ట్రాలీ సర్వీస్ లపై ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఎక్స్(X)లో ట్వీట్ చేశారు. "ఈ సర్వీస్ చాలా బాగుంది. విదేశాల్లో కూడా నేను ఇలాంటి సదుపాయం చూడలేదు.ప్రెట్టీ కూల్" అంటూ ట్రాలీలను ఉపయోగించే విధానానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
Updated Date - Dec 16 , 2023 | 12:24 PM