ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Polls : కుమార స్వామి సతీమణి పోటీపై స్పష్టత

ABN, First Publish Date - 2023-04-04T15:58:45+05:30

కర్ణాటక శాసన సభ ఎన్నికలు (Karnataka Assembly polls)లో తన సతీమణి అనిత (Anita) పోటీ చేయబోరని జేడీఎస్

HD Kumaraswamy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికలు (Karnataka Assembly polls)లో తన సతీమణి అనిత (Anita) పోటీ చేయబోరని జేడీఎస్ అగ్ర నేత హెచ్‌డీ కుమార స్వామి (H D Kumaraswamy) మంగళవారం చెప్పారు. ఆమెకు ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారని చెప్పారు. ఆమె ప్రస్తుతం ఎమ్మెల్యే అనే విషయం తెలిసిందే.

అనిత శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఒత్తిడి తెస్తున్నారని, ఆమె తుముకూర్ రూరల్ టిక్కెట్‌ను కోరుతున్నారని వచ్చిన మీడియా కథనాలను కుమారస్వామి తోసిపుచ్చారు. ‘‘హసన్ రాజకీయాలు వేరు, నా సతీమణి రాజకీయాలు వేరు’’ అన్నారు. గతంలో పార్టీని కాపాడటం కోసం ఆమె పోటీ చేశారన్నారు. ఆమెకు ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి లేదని, వాటి నుంచి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారని చెప్పారు.

గతంలో అనిత మూడు ఎన్నికల్లో పోటీ చేశారని, అప్పట్లో ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థి లేకపోవడమే అందుకు కారణమని చెప్పారు. పార్టీని కాపాడటం కోసం తాను ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చానని, పోటీ చేయించానని చెప్పారు.

ఇదిలావుండగా, హసన్ స్థానం కోసం కుమార స్వామి సమీప బంధువు భవాని రేవణ్ణ గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు ఆ టిక్కెట్ ఇచ్చేది లేదని కుమార స్వామి చాలాసార్లు చెప్పారు. పార్టీకి విధేయుడైన ఓ కార్యకర్త అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి :

Karnataka assembly polls: కర్ణాటకలో బీజేపీ గెలిచి తీరాల్సిందే... ఎందుకంటే?

Karnataka Congress : కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్ధూ, డీకే వర్గాల పోటాపోటీ

Updated Date - 2023-04-04T15:58:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising