Annamalai: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆగ్రహం.. ఆ పథకానికి ఈ నిధులే దొరికాయా..
ABN, First Publish Date - 2023-08-01T11:24:24+05:30
ఎస్సీ, ఎస్టీ మహిళల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి పంపిణీ చేసే నిధులను డీఎంకే ప్రభుత్వం(DMK Govt) గృహిణుల సాధికార పథకానికి మళ్లి
ప్యారీస్(చెన్నై): ఎస్సీ, ఎస్టీ మహిళల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి పంపిణీ చేసే నిధులను డీఎంకే ప్రభుత్వం(DMK Govt) గృహిణుల సాధికార పథకానికి మళ్లిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఆరోపించారు. ఆయన మంగళవారం ఈ అంశంపై తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పాఠశాలలు, హాస్టళ్లలో మెరుగైన వసతుల కల్పన, అట్రాసిటీ సంఘటనల్లో బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తోందన్నారు. అయితే, రూ.10 కోట్లను ఎస్సీ, ఎస్టీలకు ఉపయోగించకుండా డీఎంకే ప్రభుత్వం తిప్పి పంపించిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో గృహిణుల సాధికార ప్రోత్సాహక నిధుల పథకం కోసం రాష్ట్రప్రభుత్వం కొత్తగా నిధులు కేటాయించకుండా, ఎస్సీ, ఎస్టీ మహిళల సంక్షేమం కోసం కేంద్రం కేటాయించిన నిధులు మళ్లించడం ఖండించదగ్గదని అన్నారు. గృహిణులకు నెలకు రూ.1,000 చొప్పున సాయం అందిస్తామని డీఎంకే ప్రభుత్వం తప్పుడు హామీ ఇచ్చిందని, తర్వాత అర్హత కలిగిన గృహిణులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని మాట మార్చిందని, దీనిపై ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) సమాధానం చెప్పాలని అన్నామలై డిమాండ్ చేశారు.
Updated Date - 2023-08-01T11:24:24+05:30 IST