ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tamil Nadu : తమిళనాడు గవర్నర్, డీఎంకే మధ్య మరో వివాదం

ABN, First Publish Date - 2023-06-16T13:12:30+05:30

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi), అధికార పార్టీ డీఎంకే మధ్య మరో వివాదం తలెత్తింది. మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన సెంథిల్ బాలాజీ నిర్వహించిన మంత్రిత్వ శాఖలను వేరొకరికి కేటాయించడానికి సంబంధించిన ఫైలును రవి తిప్పి పంపడంతో డీఎంకే నేతలు రగిలిపోతున్నారు. బీజేపీకి ఏజెంట్‌గా వ్యవహరించవద్దని రవికి సలహా ఇస్తున్నారు.

RN Ravi, MK Stallin
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi), అధికార పార్టీ డీఎంకే మధ్య మరో వివాదం తలెత్తింది. మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన సెంథిల్ బాలాజీ నిర్వహించిన మంత్రిత్వ శాఖలను వేరొకరికి కేటాయించడానికి సంబంధించిన ఫైలును రవి తిప్పి పంపడంతో డీఎంకే నేతలు రగిలిపోతున్నారు. బీజేపీకి ఏజెంట్‌గా వ్యవహరించవద్దని రవికి సలహా ఇస్తున్నారు.

తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని 2011-2015నాటి అవినీతి కేసులో బుధవారం అరెస్టు చేశారు. ఆయనను జూన్ 28 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌కు కోర్టు ఆదేశించింది. ఆయనకు తక్షణమే గుండె శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. ఇదిలావుండగా, బీజేపీ నేత‌ృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తోందని డీఎంకే ఆరోపించింది. ఆయనను అరెస్టు చేయడానికి ముందు సమన్లు జారీ చేయలేదంటూ డీఎంకే నేత ఒకరు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన మంత్రివర్గ సహచరులను కేంద్ర దర్యాప్తు సంస్థలు హింసిస్తున్నాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. దర్యాప్తునకు సహకరిస్తానని సెంథిల్ బాలాజీ చెప్పినప్పటికీ హింసిస్తున్నారన్నారు. బీజేపీ తాటాకు చప్పుళ్లకు బెదిరిపోయేది లేదన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సెంథిల్ బాలాజీని 15 మంది రాష్ట్ర మంత్రులు పరామర్శించారు.

సెంథిల్ బాలాజీ నిర్వహించిన విద్యుత్తు, ఎక్సయిజ్ మంత్రిత్వ శాఖలను మంత్రులు తంగం తెన్నరసు, ఎస్ ముత్తుసామిలకు అప్పగించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు. ఈ ప్రతిపాదనతో ఫైలును గవర్నర్ రవికి పంపించారు. బాలాజీ అస్వస్థతతో బాధపడుతున్నందువల్ల ఈ మార్పు చేస్తున్నట్లు తెలిపారు. అయితే రవి ఈ ఫైలును తిరస్కరించారు.

ఈ నేపథ్యంలో తమిళనాడు మంత్రి కే పొన్ముడి గురువారం రాత్రి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి, గవర్నర్ రవిపై విరుచుకుపడ్డారు. బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరించవద్దని కోరారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సెంథిల్ బాలాజీని అరెస్టు చేసినందువల్ల ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందువల్ల, ఆయన నిర్వహిస్తున్న శాఖలను ఇతర మంత్రులకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రతిపాదించారని చెప్పారు. అయితే గవర్నర్ ఈ ఫైలును తిరస్కరించారన్నారు. మంత్రి పదవుల కేటాయింపునకు తగిన కారణాన్ని తెలుపలేదని చెప్తూ, ఈ ఫైలును తిరస్కరించారన్నారు. స్టాలిన్ చెప్తున్న కారణాలు తప్పుదోవపట్టించే విధంగా ఉన్నాయని చెప్పారన్నారు.

సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగించాలని గవర్నర్ మే 31న ముఖ్యమంత్రికి లేఖ రాశారన్నారు. అదే రోజు స్టాలిన్ జపాన్ నుంచి తమిళనాడు చేరుకున్నారన్నారు. స్టాలిన్ ఈ లేఖకు ఆ మర్నాడే సమాధానం పంపించారని చెప్పారు. ఓ కేసులో పేరు ఉన్నంత మాత్రానికి మంత్రి పదవి నుంచి తొలగించవలసిన అవసరం లేదని గవర్నర్‌కు ఈ లేఖలో చెప్పినట్లు తెలిపారు.

సెంథిల్ బాలాజీ 2011-15 మధ్య కాలంలో ఏఐఏడీఎంకే అధికారంలో ఉన్నపుడు మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఆయన ఉద్యోగాలు ఇప్పిస్తానని అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేశారని కేసులు నమోదయ్యాయి. తాము డబ్బులిచ్చినప్పటికీ తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. ‘అమ్మ’ జయలలిత మరణానంతరం 2018 డిసెంబరులో ఆయన డీఎంకేలో చేరారు.

ఇవి కూడా చదవండి :

Modi Vs Congress : నెహ్రూ మెమొరియల్ మ్యూజియం పేరు మార్పు.. కాంగ్రెస్ ఆగ్రహం..

Manipur : మణిపూర్‌లో ఆగని హింసాకాండ.. కేంద్ర మంత్రి ఇంటిపై దాడి, దహనం..

Updated Date - 2023-06-16T13:12:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising