AP, Tamilnadu: ఏపీ ప్రభుత్వానికి తమిళనాడు అధికారుల లేఖ.. దేనికోసమో తెలిస్తే...
ABN, First Publish Date - 2023-08-09T10:32:06+05:30
గత రెండు వారాలుగా చెన్నై సహా పరిసర జిల్లాల్లోనూ ఎండలు అధికంగా ఉండటంతో నగర వాసులకు నీటిని అందించే జలాశయాల్లో
పెరంబూర్(చెన్నై): గత రెండు వారాలుగా చెన్నై సహా పరిసర జిల్లాల్లోనూ ఎండలు అధికంగా ఉండటంతో నగర వాసులకు నీటిని అందించే జలాశయాల్లో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో ఈ యేడాది ఆగస్టులో మునుపటి కంటే తాగునీటి అవసరాలు విపరీతంగా పెరిగాయని, వాడకం అధికమైందని నీటి సరఫరా సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చెన్నై(Chennai)వాసుల నీటి అవసరాలు 5 కోట్ల లీటర్లకు పెరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పూండి, పుళల్, చోళవరం జలాశయాల్లోకి వచ్చే జలాల కంటే విడుదల చేసే జలాల పరిమాణమే అధికంగా ఉంటోందని తెలిపారు. చెన్నైకి రోజూ వందకోట్ల లీటర్ల జలాలు అవసరమయ్యేవని, ప్రస్తుతం ఎండలు వేసవిని తలపిస్తుండటంతో అదనంగా ఐదుకోట్ల లీటర్ల జలాలు అవసరమవుతోందని వివరించారు. ఈ పరిస్థితులలో వచ్చేవారం నుంచి వర్షాలు కురిసి జలాశయాలలో నీటిమట్టం పెరుగుతుందని భావిస్తున్నామన్నారు.
కృష్ణా జలాల కోసం లేఖ...
చెన్నైలో తాగునీటి అవసరాలు విపరీతంగా పెరుగుతుండటంతో తెలుగు గంగ ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి ఎనిమిది టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రజాపనుల శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి(Andhra Pradesh Govt) లేఖ రాశారు. జూలై నుంచి అక్టోబర్ నెల వరకూ 8 టీఎంసీల కృష్ణాజలాలు విడుదల కావాల్సి ఉండగా ఇప్పటి వరకూ 1.03 టీఎంసీల జలాలు మాత్రమే విడుదలయ్యాయని ఆ లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2023-08-09T10:32:06+05:30 IST