Manipur: మెయిటీ మిలిటెంట్లను విడిపించేందుకు.. సైన్యంపై 1500 మంది మహిళల మూకదాడి
ABN, First Publish Date - 2023-06-25T13:14:08+05:30
మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంఫాల్ ఈస్ట్‌లోని ఐతమ్ గ్రామంలో మిలిటెంట్లను విడిపించుకునేందుకు దాదాపు 1200 మంది మహిళలు చుట్టుముట్టడంతో కేవైకేఎల్గ్రూ ప్‌కు చెందిన 12 మంది మెయిటీ మిలిటెంట్స భ్యులను ఆర్మీవిడుదల చేసింది.
Manipur: మణిపూర్‌లో(Manipur) ఉద్రిక్త పరిస్థితులు(Stressful Situations) కొనసాగుతూనే ఉన్నాయి. ఇంఫాల్ ఈస్ట్‌లోని(Imphal East) ఐతమ్ గ్రామంలో మిలిటెంట్లను విడిపించుకునేందుకు దాదాపు 1200 మంది మహిళలు చుట్టుముట్టడంతో కేవైకేఎల్(KYKL) గ్రూప్‌కు చెందిన 12 మంది మెయిటీ మిలిటెంట్(Meitei Militant )సభ్యులను ఆర్మీవిడుదల చేసింది. ఇప్పటికే మణిపూర్‌లో హింసాకాండ పెచ్చుమీరడంతో ప్రాణనష్టం జరగకూడదనే లక్ష్యంతో మిలిటెంట్లను వదిలిపెట్టినట్టు ఆర్మీ తెలిపింది.
మిలిటెంట్లను విడిపించేందుకు పెద్ద ఎత్తున మహిళలను గుమికూడి సైన్యంపై దాడికి ప్రయత్నించడంతో శాంతి భద్రతల దృష్ట్యా వారిని స్థానిక నాయకుడికి అప్పగించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. మానవతా కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆపరేషన్ ఇన్‌ఛార్జ్ కమాండర్‌ను భారత సైన్యం ప్రశంసించింది.
కాగా..శుక్రవారం మైటీ మిలిటెంట్ గ్రూప్ కంగ్లీ యావోల్ కన్నలుప్( KYKL) గ్రూప్‌కు చెందిన 12 మంది మిలిటెంట్లను ఆర్టీ అదుపులోకి తీసుకుంది. ఈ గ్రూప్ 2015లో 6వ డోగ్రా యూనిట్‌పై దాడితో పాటు పలు దాడుల్లో పాల్గొన్నట్లు ఆర్మీ తెలిపింది.
మే3న స్థానికంగా ఉన్న మేటీలు, కుకీల మధ్య జాతి హింస చెలరేగింది. ఈ దాడుల్లో 115 మంది చనిపోయారు. అయితే తరుచు మహిళల మూకలు సైనిక చర్యలకు అడ్డుపడుతున్నారని ఆర్మీ తెలిపింది. భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించకుండా మణిపూర్ అంతటా మహిళలు అడ్డుకుంటున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు. జూన్ 22న ఆయుధాల దోపిడీ కేసులో దర్యాప్తు చేసేందుకు వచ్చిన సీబీఐ అధికారులను మహిళలను గ్రూప్ అడ్డుకుంది. జూన్ 23న కూడా సాయుధ గ్రూప్ కాల్పులు జరుపుతున్న చోటికి సైన్యం వెళ్లకుండా మహిళ గ్రూప్ అడ్డుకుందని ఆర్మీ తెలిపింది.
మణిపూర్‌లో ఏం జరుగుతోంది?
మే3న మెయిటీలు, కుకీల మధ్య మొదట ఘర్షణలు చెలరేగాయి. ఇటీవల మెయిటీలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ మణిపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపధ్యంలో గిరిజన సాలిడారిటీ మార్చ్ సందర్భంగా మెయిటీలు, కుకీల మధ్య ఘర్షణలు ఉదృతం అయ్యాయి. ఈ హింసాకాండ మణిపూర్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ఈ ఘర్షణల్లో 115 మంది చనిపోయారు. చాలా ఇళ్లు దగ్ధమయ్యాయి. ఎంతో నష్టం జరిగింది. చాలా మంది స్థానికులు రాష్ట్ర సరిహద్దుల్లోని అడవుల్లోకి పారిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు కేంద్రం అదనపు బలగాలను మోహరించింది. త్రైపాక్షిక ఒప్పందం నుంచి వైదొలగాలని, ఆక్రమణదారులుగా పేర్కొంటున్న అటవీ నివాస సమూహాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా చాలాకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
Updated Date - 2023-06-25T13:46:07+05:30 IST