Arunachal Pradesh : కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్... పైలట్ల ఆచూకీ కోసం గాలింపు...
ABN, First Publish Date - 2023-03-16T15:02:48+05:30
ఈ హెలికాప్టర్ సెంగె నుంచి మిస్సమరి వెళ్తోందని, దీనిలో ఓ లెఫ్టినెంట్ కల్నల్, ఓ మేజర్ ఉన్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ : భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ చీతా (Cheetah) అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్డిలలో గురువారం కూలిపోయింది. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన ఈ హెలికాప్టర్ గురువారం ఉదయం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయింది. బొమ్డిలకు పశ్చిమ దిశలో ఉన్న మండల సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. గువాహటి రక్షణ రంగ ప్రజా సంబంధాల అధికారి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ ఈ వివరాలను ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ హెలికాప్టర్ సెంగె నుంచి మిస్సమరి వెళ్తోందని, దీనిలో ఓ లెఫ్టినెంట్ కల్నల్, ఓ మేజర్ ఉన్నట్లు సమాచారం. గాలింపు బృందాలను రంగంలోకి దించినట్లు ఈ ప్రకటన వెల్లడించింది.
ఇవి కూడా చదవండి :
Parliament : పార్లమెంటుకు రాహుల్ గాంధీ?... క్షమాపణ చెప్పబోతున్నారా?...
Nobel Peace Prize : మోదీకి నోబెల్ శాంతి బహుమతి... నోబెల్ ప్రైజ్ కమిటీ నేత సంచలన వ్యాఖ్యలు...
Updated Date - 2023-03-16T15:02:48+05:30 IST